ఇప్పటి ఏలూరు దగ్గరున్న పెదవేంగిలో విష్ణుకుండినులు క్రీ.శ. 5,6 శతాబ్దములలో చిత్రరథస్వామి ఆలయాన్ని పాటూరు నందు విష్ణుగ్రహ స్వామి ఆలయాన్ని నిర్మించారు9.
గోదావరి నుండి మహానది వరకు వ్యాపించి ఉన్న కళింగదేశ రాజ్యాన్ని గంగ వంశీయులు ఎక్కువకాలం పరిపాలన చేశారు. వీరు క్రీ.శ. 6వ శతాబ్దానికి చెందినవారు.
ఈ వంశంలో భాగవతులు అధికం. వీరి కాలంలో భాగవతాలు కళింగాంధ్రలో వ్యాప్తి చెందాయి. కళింగలో గంగ వంశజులలో హస్తవర్మ, నారాయణుని బలి చతురుత్ర ప్రవర్తనం ఖండస్పుటిత సంస్కారం నిమిత్తం “రోహణికి" గ్రామంనందు ఆరుహలా ల భూమిని దానం చేసినట్లు తెలుస్తుంది. ఇతని కాలం ఆరవ శతాబ్ది. కళింగంనందలి మొదటి విష్ణ్వాలయం.ఈ హస్తివర్మ కు తొమ్మిదేళ్ళ తర్వాత ఇంద్రవర్మ మరొక గంగవంశపు రాజు హరిభట గ్రామములో రామేశ్వరస్వామికి బలిచరు సత్ప్రవర్తనము మరియు ఖండస్పుటిత సంస్కారం కోసం రెండునాగళ్ళ భూమిని దేవాగ్రహారము చేసెను. దీనిని బట్టి కృష్ణా గోదావరులకు దక్షిణమున ఉన్నట్లే ఉత్తరాన కూడా క్రీ.శ. 7వ శతాబ్ది ఆరంభమున విష్ణు దేవాలయాలు ఉన్నట్లు చారిత్ర కాధారాల ద్వారా తెలుస్తోంది. మల్లంపల్లి సోమశేఖర శర్మ “వైష్ణవం”.10
వీరికాలంలో నిర్మించిన శ్రీముఖలింగం, శ్రీకూర్మము పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ లోని సూర్యదేవాలయాలు ప్రధానమైనవి. వైష్ణవ మత వ్యాప్తికి వీరెంతగానో పాటుపడ్డారు. కళింగాంధ్రదేశంలో క్రీ.శ. 7వ శతాబ్దానికి పూర్వమే భాగవతమతంగా ప్రచారంలోకి వచ్చింది.
తూర్పు చాళుక్యులు ఆంధ్రదేశాన్ని క్రీ.శ. 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు పరిపాలించారు. ఈ సామ్రాజ్య వ్యవస్థాపకుడు విష్ణువర్ధనుడు. వైష్ణవ మతానికి మరింత ప్రాధాన్యం ఇచ్చి ఆదరించాడు. తరువాతి కాలంలో వచ్చిన రాజులు కూడా వైష్ణవ మతాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడానికి ఎంతో కృషిచేసారు.
ప్రాచీన కాలంలో భాగవత మతం అని పిలువబడిన వైష్ణవ మతం ఆంధ్రప్రదేశ్లో క్రీ.శ.3వ శతాబ్ది నుండి క్రీ.శ. 7వ శతాబ్దం నాటికి ప్రధాన మతంగా వ్యాప్తిలోకి వచ్చింది. వైష్ణవ మతం అన్ని చోట్ల ఆదరించబడింది.
వివిధ రాచరిక పాలనలోకి పోయిన్పటికీ ఆంధ్ర ప్రాంతాలలో వైష్ణవ సంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. జైన, బౌద్ధ, శైవ వైష్ణవ సంక్లిష్ట సంస్కృతులు ఆంధ్రదేశంలో ఆచరణలో ఉన్నప్పటికీ వైష్ణవ సంప్రదాయం తమ ఉనికిని కోల్పోలేదు.
ఆళ్వారులు ప్రారంభించిన వైష్ణవతత్త్వ వ్యాప్తి ఈనాటికీ కొనసాగుతున్నది.
5. విశిష్టాద్వైత సిద్ధాంత స్వరూపం
విశిష్టాద్వైతానికి కూడా ఇతర వేదాంతాలవలే ప్రస్థానత్రయమే ప్రమాణము
31