పంచరాత్రగమము అనుసరిస్తే మరికొన్నిచోట్ల వైఖానసాగమముననుసరించి అర్చనలు జరిగేవి. ఈ విష్ణ్వాలయంలో గుడికి ఎదురుగనున్న ధ్వజస్తంభం నందు “వెఱియ తిరువడి" గరుడాళ్వారు వేంచేసినట్లు తెలుస్తోంది.
The Silappadikaram, which was composed at this time describes in him as the rechining deity in Srirangam and tall god in Thirupathi .6
తమిళ ప్రాచీన గ్రంథం శిలప్పదిగారం క్రీ.శ. 2వ శతాబ్ద కాలములో వచ్చినట్లు చరిత్రకారులు గుర్తించారు. అందులో 'తిరుపతి' ఉన్న శ్రీ వెంకటేశ్వరుని గూర్చి వర్ణించినట్లు తెలుస్తోంది. వైష్ణవ సంప్రదాయం ఆంధ్రదేశంలో విస్తరించినట్లు స్పష్టమవుతుంది.
క్రీ.శ. 3వ శతాబ్ది నాటికి తెలుగు ప్రజానీకంపై రామాయణ ప్రభావం ఉన్నట్లు అమరావతి శిల్పాల ద్వారా తెలుస్తుంది. నాగానిక, నానాఘాట్ శాసనములలో సంకర్షణ, వాసుదేవులను స్తుతించుట శాతావాహనులు వేయించిన శాసనములలో విష్ణుస్తోత్రం కన్పిస్తుంది. వీటన్నంటిని బట్టి ఆంధ్రదేశంలో వైష్ణవం ప్రారంభదశ నుండే మొదలైందని చెప్పవచ్చు.
శాతావాహనుల తరువాత ఆంధ్రదేశాన్ని ఇక్ష్వాకులు అర్ధశతాబ్దం వరకు పాలించారు. ఈ వంశ స్థాపకుడు వాశిష్ఠపుత్ర శాంతమూలుడు. విష్ణువర్ధన గోత్రానికి సంబంధించినవాడు. శాంతమూలుడు వైదిక మత సాంప్రదాయకుడు. శ్రీపర్వతం మీద ఉన్న విజయపురి వీరి రాజధాని. తదనంతరం ఆంధ్రదేశాన్ని పల్లవులు పరిపాలించారు. వీళ్ళు కాంచీపురంను రాష్ట్ర రాజధానిగా చేసుకొని క్రీ.శ. 3వ శతాబ్దం నుండి క్రీ.శ. 9వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని దాదాపు 600 యేండ్లు పరిపాలించారు. వీరు పరమ భాగవతులు. వీరికాలంలో దక్షిణాపథంలో వైష్ణవమునకు గొప్పస్థానం లభించింది. వైష్ణవం ప్రభుత్వ మతంగా ఆదరించబడింది. విష్ణువును పూజించు విషయంలో వీరు తమ శాసనాలలో ప్రకటించారు7.
విష్ణుస్తుతి ప్రారంభదశ వీరి శాసనాల ద్వారా పరిశీలించవచ్చును. పల్లవుల వంశోత్పత్తి, విష్ణువుతో ప్రారంభమైనట్లు నరసింహవర్మ వేయించిన వాయటూరి శాసనము ద్వారా స్పష్టమౌతుంది.
దాళూరు శాసనం ద్వారా క్రీ.శ. 4వ శతాబ్దం నాటికే పల్లవుల కాలంలో విష్ణు ఆలయాలు ఉన్నాయి. కందుకూరులో ఒక సేనాపతి నిర్మించిన విష్ణ్వాలయంనకు పల్లవ వంశీయులలో ఒకరు ఉరువల్లి గ్రామాన కొంత దానం చేసినట్లు తెలుస్తుంది.
క్రీ.శ.4,5 శతాబ్దములలో కృష్ణా, గోదావరి నదుల మధ్యగల తెలుగుదేశమును పరిపాలించిన శాలంకాయనులు వైష్ణవ సంప్రదాయులుగానే కన్పిస్తున్నారు. వీరు పరమ భాగవతులు. వీరి ఆరాధ్య దైవము సూర్యుడు. వైదిక సంప్రదాయానుసారం ఆదిత్యుని పూజిస్తారు. ఆ తర్వాత శాలంకాయన వంశీకుడగు నందివర్మ విష్ణుగ్రహ స్వామి ఆలయాలకు వేరు వేరు గ్రామాలలో కొంత భూమిని దానం చేశాడు.
30