14. తెలంగాణలో మిత అయ్యల్వార్ల సామాజిక జీవన చిత్రణ
దేశముఖ్, దేశపాండ్య ఇళ్ళలో గోశా (పరదా పద్ధతి) అమలులో ఉంది. రెడ్డి, వెలమల పెత్తనం ఎక్కువ. దేశ్ముఖ్, దేశ్పాండే కరుడుగట్టిన బ్రాహ్మణీయ భావజాలాన్ని ఆచరించడం. తెలంగాణలో మాములు బీద బ్రాహ్మణులు పొట్టకూటి కోసం, బ్రతుకుదెరువు కోసం మాత్రం నానా బీదరికాలను అనుభవించుతూ, దేశ ముఖ్, దేశ్పాండే, వెలమల, రెడ్డి, పటేల్ పట్వారీ ఇండ్లలలో విసురుతూ, వంటలు చేస్తూ నీళ్ళు పోయడం వంటి అనేక సేవలు, వెట్టిపనులు చేస్తూ జీవించారు.
పౌరోహిత్యం చేసేవారు తెలంగాణలో శ్రీ వైష్ణవులైన వారిలో చాలావరకు బలహీన వర్గాల వారు సామాజిక అంతస్తు పొందారు. వీరికి గ్రామ పౌరోహిత్యం ఉండదు. కేవలం వైష్ణవత్వం ప్రచారం కోసం దేవుని విగ్రహాలకు పూజలందిస్తూ జీవించారు. ఇటువంటి కోవకి చెందినవారే మిత అయ్యల్వార్లు. మిత అయ్యల్వార్లు వారి గాన మాధుర్యంతో ప్రజలను ఆనందింప జేసేవారు. వారు పాడుకునే పాటలను “తిరునామాలు” అని వ్యవహరిస్తారు.
24