సంచారులు మరియు ఇతర కళా ప్రదర్శకులు అనే వర్గంలో ఇతరులు, అగౌరవనీయ వృత్తుల వారు ఉన్నారని పేర్కొని ఆ విభాగంలో...
| 1 | పరదేశి | 2 | బుడబుడకి |
| 3 | పటంవారు | 4 | బాలసంతోష్ |
| 5 | శారద | 6 | బనియాల |
| 7 | బౌసాగర్ | 8 | మొండి |
| 9 | పాండవులు | 10 | బాదంపారు |
| 11 | మిత్తులు | 12 | విప్రవినోదులు |
| 13 | రందేశ | 14 | గంజికూట |
మొదలైనవారిని అగౌరవనీయ వృత్తులు అనే విభాగంలో 11వ పేరు విభాగంగా మిత్తులను పేర్కొనడం జరిగింది.
మిక్కిలినేని రాధకృష్ణమూర్తిగారు జానపద కళారూపాలు అనే పుస్తకంలో మిత అయ్యల్వార్ల వాద్యపరికరాన్ని 'కడ్డి' వాద్యమన్నారు. ఈ వాద్యం వీణ మాదిరిగా ఉంటుందని, దీనిని చేతివ్రేళ్ళతో వాయిస్తారు అని పేర్కొన్నారు. మిత అయ్యల్వార్లు ఈ వాద్యంతో భగవన్నామ సంకీర్తనలను వాయిస్తూ గానం చేస్తారని వారు చెప్పారు".
ఈ వాద్యాన్ని ముందుపెట్టుకొని, రెండు సన్నని పుల్లలతో జలతరంగ్ వాయిద్యాన్ని వాయించినట్లు వాయిస్తారు. ఈ స్వర మాధుర్యం ఎంతో మధురంగా ఉంటుంది. వీరి వృత్తికి ప్రాణమైంది ఈ వాద్యమే అని వారు పేర్నొన్నారు. ఈ కడ్డి వాద్యాన్ని ఇతరులెవరూ వాయించలేరు అని దృఢంగా చెప్పగలిగారు. దీనిని ప్రత్యేకమైన శిక్షణతోను, సాధనతోనూ సాధించవలసిందే అని మిక్కలినేని రాధాకృష్ణమూర్తి గారు తెలియచేసారు.
కళాదర్శనమ్ గ్రంథంలో కర్నాటి గారు మిత్తల్ అయ్యల్వార్లని తెలంగాణ దాసర్లు, సర్కాంధ్ర దాసర్లు అని విభజించారు".
సంకీర్తనలను, వైష్ణవగాథలను ప్రచారం చేయడం వృత్తిగా స్వీకరించిన వారు దాసర్లుగా ప్రసిద్ధి చెందారు. సర్కాంధ్రలోని దాసర్లు వైద్యం చేసే దాసర్లు, బిక్షమెత్తే హరిదాసులున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని దాసరులను మిత్తుల అయ్యవార్లని అని అంటారని ఆయన పేర్కొన్నారు. వెనుకటి కాలంలో వైష్ణవ గురువులకు ఎంత గౌరవం ఉండేదో ఈ మిత్తుల అయ్యవార్లకు అంతటి గౌరవం ఉన్నట్లు తెలుస్తోంది అని వారు పేర్కొన్నారు. వీరు మిత అయ్యల్వార్ వారి వాద్యాన్ని ఒక రకమైన తంబూర అని అన్నారు. దీనిపై గజ్జెల కోలలతో వాయిస్తుంటే తంబూర నాదమే కాక, మృదంగ ధ్వని కూడా పలికేదని ఆయన పేర్కొన్నారు.
23