ఇక్కడ శైవ వైష్ణవ భేదం కూడా కారణం కావచ్చు. శఠగోపం విష్ణుపాదాంకితం కనుక వీరు పెట్టుకొని ఉండకపోవచ్చు కూడా. విశ్వకర్మలు సహజంగా శైవులు, లింగధారులు. అందుకే శఠగోపం వైముఖ్యం ఉండవచ్చు అని పులికొండ సుబ్బాచారి గారు అభిప్రాయ పడ్డారు.
అదేవిధంగా మిత అయ్యల్వార్లు కూడా శఠగోపాన్ని పెట్టుకోరు. వీరు వైష్ణవులే, కాని పెట్టుకోరు. ఎందుకంటే తిరుప్పాణ్యాళ్వార్లు చరిత్రలో లోక సారంగముని దైవంలో లీనమయ్యే టప్పుడు అతని పాదాలు మాత్రం లోపలికి వెళ్ళలేదని లోకసారంగముని ఆ తిరుప్పాణ్యాళ్వార్ల పాదముద్రలనే శఠగోపంగా మలిచారని తెలుస్తోంది.
ఈ విధంగా మిత అయ్యలా ్వర్ల మూల పురుషుడైన తిరుప్పాణ్యాళ్వార్ల పాద ముద్ర కనుక తమ పాదాలను తమ నెత్తిమీద మేము పెట్టుకోము అని మిత అయ్యల్వార్లు చెప్పారు.
13. మిత అయ్యల్వార్ల గురించి పూర్వ పరిశోధనా వివరాలు
మిత అయ్యల్వార్లను మొదట నిత్య వైష్ణవులు అంటారని నా క్షేత్ర పర్యటనలో తెలుసుకున్నాను. నేను క్షేత్ర పర్యటన చేసేటప్పుడు చాలామంది మమ్మల్ని నిత్య వైష్ణవులు అని అంటారని పేర్కొన్నారు. అలా ఎందుకు అని ప్రశ్నించగా నిత్యం మేము దైవారాధనలోనే ఉంటాము కాబట్టి మమ్మల్ని నిత్యులు అంటారు. మేము వైష్ణవులం కాబట్టి నిత్యవైష్ణవులుగా పిలుస్తారు అని వారు పేర్కొనడం జరిగింది. ఇంకొందరు నిత్యం స్వామి వారిని తమ తిరునామాలతో ఓలలాడించే వారు కనుక వీరిని నిత్యవైష్ణవులు అని అంటారు అని చెప్పడం జరిగింది. ఆ తరువాతి కాలంలో నిత్యులు, కాస్త నిశ్చులుగా రూపాంతరం చెంది. నిశ్చులు కాస్త శబ్ద పరిణామం చెంది మిత్తులుగా మారింది. ఆ తరువాత వీరిని అయ్యవార్లు అని కూడా పిలుస్తారు. కాబట్టి మిత్తుల అయ్యవార్లు అని పిలిచేవారు. కాని గెజిట్ లో మాత్రం మిత అయ్యల్వార్లుగా వీరిని పిలుస్తున్నారు. సమాజంలో కొన్నిచోట్ల వీరిని మిత్తల్ అయ్యవార్లని, మిత అయ్యవార్లగా, మిత్తులోల్లు అని కూడా పిలుస్తున్నారు.
ఈ మిత అయ్యల్వార్ల గురించి పూర్వకవులు కొందరు ప్రస్తావించడం జరిగింది.అందులో కొన్ని ఇక్కడ పేర్కొనటం జరిగింది.
మొట్టమొదటగా ఉస్మానియా యూనివర్శిటిలో పరిశోధక వ్యాసం సమర్పించిన బిరుదురాజు రామారాజుగారు “తెలుగు జానపద గేయ సాహిత్యంలో వీరిని గురించి ప్రస్తావించటం జరిగింది. వారిని మాలదాసరులనే మిత్తిరి దాసులంటారు అని పేర్కొన్నారు. వీరి గురించి బిరుదు రాజు రామరాజు గారు ఈ మిత్తిదాసర్లు, విప్రనారాయణ, ప్రహ్లాద యక్షగానాన్ని ప్రదర్శిస్తారు అని పేర్కొనటం జరిగింది. కీర్తనలు పాడుతూ బిక్షమెత్తుకొనే వారని తెల్చారు. మిత్తిరి దాసరులు వాడే మరియొక వాద్యం ఉందని ప్రస్తావించడం జరిగింది. దానిని భూమిపై ఉంచి, రెండు చేతులతో రెండు సన్నని తీగలపై వాయిస్తారని కూడా బిరుదురాజు
21