Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సహజంగానే ఉన్నతులుగా భావిస్తారు. అన్ని కుల పురాణాలలోని ఆశ్రిత కులం దాతృ కులం నుండి పుట్టినట్టు, లేక దాతృ కులంలోనివారే కొందరు శాపగ్రస్తులై లేక శిక్షించబడి ఆశ్రితా కులంగా మారినట్లు లేక ఆశ్రిత కులపురుషుడు ఒకేసారి కలిసి పుట్టినట్లు భిన్న విధాలుగా కథనాలు ఉన్నాయి. అన్నింట గ్రహించ వలసినదేమిటంటే ఆశ్రితులు, దాతలు తొలుత ఒకే కులంగా ఉండేవారని, కాని రెండు స్పష్టంగా విడిపోయిన తర్వాత పూర్తిగా భిన్న కులంగానే మారుతూ వచ్చాయి. ఆ రెండు కులాల మధ్య ఆశ్రిత, ధాత సంబంధాలే కాని వివాహా, భోజన సంబంధాలుండవు. దాతల ఇండ్లలో ఆశ్రితులు పక్కగా భోజనం చేస్తారే కాని ఆశ్రితుల ఇండ్లలో దాతలు భోజనం చేయడం ఉండదు. మాదిగ మాల ఆశ్రితులలో మాత్రం భిన్నంగా దాతల కన్న ఆశ్రితులు అధికులుగా భావిస్తారు. అని వీరే ప్రకటించుకుంటారు. అయినా మిగతా ఆశ్రితులు కంటే వీరు పూర్తిగా భిన్నం. వీరు దాతలు ఇండ్లలో భోజనం చేయడం కాని, వారితో ఇతర కుల సంబంధాలు పెట్టుకోవడం కానీ ఉండదు.

మిత అయ్యల్వార్ కులంలోని వారు కూడా మాల ఇండ్లలో కర్మకాండలకు వెళ్ళి అక్కడి ఇంట్లో వారికి సరిపోయే వరకు మాంసం, అన్నం వండుతారు. కానీ వాళ్ళతో పచ్చిమాంసం, పచ్చిమిర్చి, బియ్యం, ఎల్లిపాయలు, ఎండుమిర్చి మిగతావన్ని ఇంటికి తెచ్చుకుంటారు. కానీ వారితో సమానంగా తినరు. ఈ కులస్థులు మిత అయ్యల్వార్లు మాల వాళ్లకు గురువులుగా భావించి వారికి వారే ప్రకటించుకుంటారు.

విశ్వకర్మ పురాణం: విశ్వకర్మలలో శైవులు, వైష్ణవులు ఉంటారు. మొట్టమొదటిసారిగా పెట్టిన దండం గుడిలో దేవతామూర్తిని తయారు చేసిన శిల్పికి చెందుతుంది.

రెండోసారి పెట్టిన దండం ఆ శిల్పి పాత్ర ప్రతిష్ట చేసిన విశ్వకర్మకు చెందుతుంది. మూడో దండం దేవుడికి పోతుంది. అందుకే మనం గుడికి పోయినప్పుడు దండం పెట్టినా, గంట కొట్టి ప్రదక్షిణం చేసినా మూడుసార్లు చేయాలి.

ఈ విశ్వకర్మ పురాణం, రుంజలు, పననివారు ప్రచారం చేస్తున్నారు. ఆలయానికి వెళ్ళిన ప్రతివారు, పూజారి చేత శఠగోపం పెట్టించుకొని కానుక వేసి వస్తారు. కాని విశ్వకర్మ వంశీయులు అయిదు వృత్తుల వారు, ఆలయాలలో పూజారుల చేత శఠగోపం పెట్టించుకోరు. దానికి రుంజ, పనస వారు చేప్పే కులపురాణం ఇలా వివరణ ఇస్తుంది.

విశ్వకర్మలు బ్రాహ్మణులకన్నా అధికులమని వారి చేయి విశ్వకర్మల నెత్తిమీదికి వచ్చి ఆశీర్వదించకూడదని, అంతేకాకుండా శఠగోపాన్ని పంచనం వారు కాలికింద పెట్టుకొని తయారు చేస్తారు కనుక తిరిగి అదే నెత్తిమీదికి రాకూడదని పనసవారు చెప్తారు. అలా పెట్టుకోవడం వల్ల విశ్వకర్మలకు పాపం కూడా వస్తుందని వీరు భయపడతారు.

20