Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
42 ముద్రం కౌండిన్య
23 సామల కురాశర
25 పరువణ శఠగోప
44 శ్రీచూర్ణం శఠగోప
26 పూసాల విశ్వామిత్ర
27 తుమ్మకొమ్మ వనకల
28 విఠాం సిందూర
29 వనకుల భరణం వాధీర
34 తాళ్ళూరి వడూల
35 తులసిమొగ్గ గార్గేయ
37 శ్రీరామ బ్రహ్మఋషి
38 ఎర్నం సుక్నాం
39 మద్దెల గొల పరుషి
40 తిరుమల పవన
41 నీలం రఘఋషి
43 అతిశాస్త్రం అచ్యుత
45 తిరునగరి భార్గవ

12. ఆశ్రిత కులాల్లో మిత అయ్యల్వార్ల పాత్ర

ఆశ్రిత కులాల వారు ఎక్కువగా కులపురాణాలు చెబుతారు. కుల పురాణంతో పాటు ఆశ్రిత గాయకులు దాతకులం వారికి సంబంధించిన చారిత్రక పురుషుల కథలు, ప్రముఖుల కథల్ని కూడా ప్రచారం చేస్తారు. ఈ కథలు చెప్పడం కూడా దాత కులం గొప్పతనాన్ని ప్రచారం చేయడం కోసమే. కుల పురాణ కథనం వంశ పురుషులు చరిత్ర కథనం కేవలం వినోదం కోసం కాదు. అంతకుమించిన ప్రయోజనాన్ని ఆశించి జరిగేవి. కొందరు ఆశ్రిత గాయకులు వైవిధ్యమైన రెండు కథాగానాలే కాకుండా అదనంగా భారత, రామయణ సంబంధ, ఇతర కథల్ని కూడా ప్రదర్శిస్తున్నారు. ఇది కేవలం వినోదం కోసమే. ఆశ్రిత గాయకులలో రామాయణ, మహాభారత కథల్ని గానం చేయడంలో మిత అయ్యల్వార్లు ముందంజలో ఉన్నారు.

ఆశ్రితులకు ఇచ్చే దానాలకు కట్నం, మిరాశి, సంభావన, వంతన, ఇలవరన్ త్యాగం అనే పేర్లు ఉన్నాయి. మిత అయ్యల్ వార్లు “సంభావన" అనే పదాన్ని ఎక్కువగా వాడుతారు. సంభావన కింద చాలా కొద్దిమంది భూములు కూడా సంపాదించుకున్నామని దూరం పోవడం ఇష్టం లేక వదలుకున్నామని చెప్పారు. క్షేత్ర పర్యటనలో దాత కులాలన్ని వారి ఆశ్రితులకన్నా

19