నిలుపుకున్న వారెవ్వరూ లోకంలో లేరు. అందువల్ల నిన్ను చీల్చి తినే ఉద్దేశం నాకు లేదు. ఒక షరతు మీద నిన్ను విడచిపెట్టాలని అనుకుంటున్నాను” అన్నాడు.
“ఏమిటా షరతు”? అని ప్రశ్నించాడు మాలదాసరి. “ఇవ్వాళ నువ్వు గుడివద్ద పాడావు చూడు. ఆ పాట వల్ల నీకు లభించిన పుణ్యాన్ని నాకు వదిలిపెట్టు" అన్నాడు రాక్షసుడు. "నేను సంపాదించిన పుణ్యాన్ని నీకివ్వను అన్నాడు మాలదాసరి. “పోనీ, నువ్వు పాడిన ఒక్క పాట వల్ల కలిగే పుణ్యమైనా నాకివ్వు" అన్నాడు రాక్షసుడు. "అదీ ఇవ్వలేను” అన్నాడు మాలదాసరి. “ఆ పుణ్యంలో ఒక వంతైనా నాకివ్వు" అన్నాడు రాక్షసుడు. "అది నీకివ్వను. ఎందుకు నన్ను చీల్చి తినడానికి వెనకాడుతున్నావు?" అని ప్రశ్నించాడు మాలదాసరి. ఈ పుణ్యం కంటే, నా రక్తమాంసాలు నీకు రుచికరంగా వుంటాయి గదా? అన్నాడు మాలదాసరి.
పుణ్యమివ్వడానికి మాలదాసరి సమ్మతించక పోవడంతో రాక్షసుడు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు. "పుణ్యాత్ముడా, ఇవ్వాళ నువ్వు పాడిన పాటల్లో ఒక్క రాగం పాడి అందువల్ల సంపాదించిన పుణ్యమైనా నాకు ధారపోస్తే తత్ఫలితంగా నా రాక్షస రూపం తొలగిపోతుంది. పూర్వజన్మలో నేనొక బ్రహ్మణుణ్ణి. అప్పుడు నేను నా ధర్మాలను సరిగా నిర్వర్తించని కారణంవల్ల ఈ రాక్షస జన్మ నాకు ప్రాప్తించింది. శాపవిమోచనం కలిగే సమయం ఆసన్నమయింది. ఈ జన్మలోంచి నన్ను గట్టెక్కించే బాధ్యత నీదే" అని రాక్షసుడు మాలదాసరిని బ్రతిమాలాడాడు.
రాక్షసుని బలం చూసిగాని, అతని బెదిరింపులకు గాని ఏమీ మనోవికారం చెందని మాలదాసరి ప్రస్తుతం బ్రతిమాలాడుతూ చెప్పిన మాటలు విని ఆర్ద్ర చిత్తుడయ్యాడు. “అలాగే, కానీ ఇవాళ నేను పాడిన రాగాలలో ఒకటి కైశికం. దాన్ని ఆలపించగా నేను సంపాదించిన పుణ్యం నీకు చెందాలి. ఆ పుణ్యఫలంగా ఈ రాక్షస జన్మలోంచి నీకు విముక్తి కలిగి, సద్గతి కలగాలి" అన్నాడు మాలదాసరి.
ఆశ్చర్యం! ఆ మరుక్షణమే ఆ రాక్షసుని ఆకృతి తొలగిపోయింది. జ్యోతిర్మయమైన దేవతారూపం రాక్షసుడికి వచ్చింది. కైశిక రాగం వల్ల కలిగిన పుణ్యం వల్ల దేవతాకృతిలో ఉన్న అతను మాలదాసరికి తన కృతజ్ఞతను తెలియజేశాడు. స్వర్గలోకానికి వెళ్లాడు. ఆళగయ నంబ తనను గురించి పాడిన ఆ మాలదాసరికి “నంపాడువానే” అని పేరు పెట్టాడు. దీన్ని పాడిన ఆరోజు కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి తిధిగా ఈ రోజుకు కైశిక ఏకాదశి అనే పేరు వచ్చింది. నేటికీ వైష్ణవాలయాలలోను, వైష్ణవ గృహాలలోను నిమ్నజాతికి చెందిన ఈ మాలదాసరి స్మృత్యర్ధం కైశిక ఏకాదశి ఘనంగా కొనియాడబడుతున్నది. మాలదాసరి, మిత అయ్యల్వార్లు ఒకటే అన్న పలు వాదనలున్నాయి. కానీ మిత అయ్యల్వార్ల వాద్యంతో వారు తమ ప్రత్యేకతను చాటుకొంటారు. నేను ఈ పరిశోధనలో వాళ్లకున్న తేడాను సరియైన ఆధారాలు లేకపోవడం వల్ల తెలియ పరచలేక పోతున్నాను.
17