అబద్ధం. ప్రాణాలు మిగలవని తెలిసి, తప్పించుకు పోయినవారు ఎక్కడైనా తిరిగి వచ్చి ప్రాణాలు ఇస్తారా? నీ మాటను నేను వినను. నాకేమో ఆకలి, నువ్వు తెలిసే అబద్ధమాడుతున్నావు” అన్నాడు.
“నేను తక్కువ జాతిలో పుట్టినా అబద్ధం చెప్పను. ఇచ్చిన మాటను నేను నిలుపుకుంటాను. నువ్వేమీ భయపడనవసరం లేదు. నా మాటలు నమ్ము. ఒకవేళ నేను ఆడిన మాట తప్పితే, ఎన్నటికి బయటపడని నరకానికి నేను వెళ్ళుదును గాక" అని మాలదాసరి జాలి గొలిపేలా అన్నాడు.
రాక్షసుడు ఆ మాటలు విన్నాడు. ఆ మాటలలో కాన వచ్చిన సత్యతత్పరత అతని రాతి గుండెను కూడా కరిగించింది. అప్పుడతను “సరే అలాగే చేయ్యి” అన్నాడు. ఇప్పుడు మాలదాసరికి ఎక్కడలేని సంతోషం కలిగింది. ఆలయాభిముఖంగా నడక సాగించాడు. కాలాతీతం కావడం వల్ల వేగంగా పరుగెత్తాడు. గుడి ముందు నిలిచాడు. అదే చివరిసారిగా పాట పాడడం అనే భావం ఆయన మనస్సులో నెలకొన్నది. కాగా ఎన్నడూ లేనంత భక్తిభావంతో పాడాడు, పాట ముగిసింది. తిరుగు ముఖం పట్టాడు. అడవి మార్గం గుండా వేగంగా వస్తున్నాడు.
ఆయన సత్యనిష్ఠను తిరుకురుంగుడినంది పరీక్షించాలనుకున్నాడు. అందువల్ల అడవి మార్గంలో బాటసారి వేషంలో దేవుడు మాలదాసరి ముందు ప్రత్యక్షమయ్యాడు. “నాయనా! ఇంతవేగంగా ఎక్కడికి వెళుతున్నావు?" అని దేవుడు అతనిని ప్రశ్నించాడు. మాలదాసరి జరిగినదంతా వివరంగా చెప్పాడు. చెప్పి, తానిచ్చిన మాటను నిలుపుకునేందుకు తానంత త్వరగా వెళ్తున్నట్టు తెలియజేశాడు.
అప్పుడా బాటసారి “నాయనా! ఆ రాక్షసుడు, పాపాత్ముడు. నీకంటే చాలా బలశాలి. కనుక నిన్ను చంపి తింటాడు. అతనికి నువ్విచ్చిన మాటను నెరవెర్చనవసరం లేదు. నువ్వు వెళ్ళకు, మీ యింటికి వెళ్ళు" అన్నాడు.
'నా మాటను నిలుపుకోవడం చాలా అవసరం. రాక్షసుడైతే మాత్రం ఏం? ఎవరికిచ్చినా సరే మాటను నిలుపుకోవలసిందే' అని మాలదాసరి రాక్షసుడున్న చోటికి త్వర త్వరగా వెళ్ళాడు. బాటసారిగా వచ్చిన విష్ణువు ఆయన చిత్తస్థైర్యాన్ని చూసి చాలా సంతోషించాడు.
రాక్షసుణ్ణి సమీపించాడు మాలదాసరి. "రాక్షసుడా! నీ దయవల్ల భగవంతుని ముందు నిలబడి ఆనందపారవశ్యంతో చక్కగా పాడి, ప్రశాంతంగా నేనిచ్చిన మాట ప్రకారం నీ వద్దకు వచ్చాను. నన్ను తృప్తిగా ఆరగించి నీ ఆకలిని తీర్చుకోవచ్చు" అన్నాడు.
మాలదాసరి సత్యభాష్యం రాక్షసుడు విన్నాడు. అతనికి కలిగిన ఆశ్చర్యానికి అంతులేదు. “నాయనా! నువ్వు మహాత్ముడివి. నీ ధర్మానుష్ఠానాన్ని నేనెలా పొగడగలను? నీలా మాట
16