Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వినకుండా వారిని తన భుజాలపైకెత్తుకొని సకల మర్యాదలతో, సప్తప్రాకారాల్లో ఊరేగిస్తూ, ఆలయ ప్రదక్షిణ చేయించి, శ్రీరంగనాథుని సన్నిధికి తీసుకొని వెళ్ళారు. శ్రీరంగనాథుడు పరమానంద భరితుడై ఆళ్వార్లకు దివ్య సాక్షాత్కారాన్ని ప్రసాదించారు. పెరుమాళ్ళ దివ్యమంగళ విగ్రహ సౌందర్యానికి ముగ్ధులైన ఆళ్వార్లు ఆ అనుభూతిని లోపల ఇముడ్చుకోలేక “అమలన్ ఆదిపరాన్" అని ఆరంభించి ఒక పది పాశురాలు పాడారు. స్వామి కళ్యాణ గుణగణాలను కీర్తిస్తూ పాడిన ఆ పాశురాలలో స్వామివారి పాద కమలాల సౌందర్యము, పీతాంబరపు వన్నె, తిరునాభి కమలాన్ని, అచ్చటనున్న ఉదర బంధనాన్ని, వక్షఃస్థల సౌందర్యాన్ని, కంఠాన్ని, ముఖారవిందాన్ని కమలరేకుల వంటి కన్నులు, కమనీయమైన అందాల వర్ణనలున్నాయి. ఈ పాశురాల ప్రబంధము నాలాయిర దివ్య ప్రబంధంలో మువలాయిరంలో చేర్చబడింది. “అమలన్ ఆదిపరాన్”లో గల చివరి పాశురాన్ని “అణియ రంగన్ ఎన్నముదనై కణ్ణ కణ్ణళ్ ముత్తాన్టి నైక్కాణాలే” (శ్రీరంగనాథుని సేవించిన నా నేత్రములు ఇతర విషయములను చూడజాలవు) అని అనుసంధానం చేస్తూ తిరుప్పాణాళ్వారు, శ్రీరంగనాథు నిలో ఐక్యమైపోయారు. వీరు పెరుమాళ్ళ శ్రీవత్సాంశ సంభూతులని పూర్వాచార్యుల ఉక్తి తిరుప్పాణాళ్వార్ల చరిత్ర వల్ల భాగవతోత్తములు వెంట భగవంతుడెప్పుడూ ఉంటాడని విశదమవుతున్నది. భగవంతునికి తనను సేవించే వారిమీదకంటే తన భక్తులను సేవించే వారంటే ఎక్కువ మక్కువ. ఈ విషయం స్వయంగా శ్రీమహవిష్ణువు అంబరీషోపాఖ్యానంలో

“నాకు మేలుగోర నా భక్తులు కాని,
భక్తాజనులకేన పరమగతియు
భక్తుడెందు జనీన బ్రఱతెంతు తనవెంట
గోవు వెంటదగులు కోడెభంగి” అని చెప్పాడు.

తన భక్తులకు హాని తలపెట్టె వారిని సహించడు. అంత్య వర్ణమునకు చెందినవాడైన తిరుప్పాణాళ్వార్లను, శ్రీరంగనాథుడు అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకున్నాడు. అట్టి మహానుభావుని ఈ తనియన్ ద్వారా స్మరించుకుందాం.

తిరుప్పాణాళ్వర్ల తిరునక్షత్ర తనియన్.

 రోహిణీ జాతం శ్రీపాణం నిచుళాపురే ౹
శ్రీవత్సాంశం గాయకేన్దం మునివాహన మాశ్రయే ౹౹

శ్రీ లోక సారజ్ఞ మహామునీంద్ర
స్కందాదిరూడం కలయామి నిత్యమ్ ౹
కళంక హీన కమనీయ భక్తం
కవీశ్వరం గాయక సార్వభౌమమ్ ।।

11