MITHAAYYALVARLU
(Their Language, literature, Sociablity & Culture)
No Art form is neither static, stationary nor sedentary. Art is very dynamic in its nature, style and presentation. As such the art forms across the globe have the essential quality of transforming themselves from one form toother or to various dimensions of the same form from time to time, according to the changes in the ideology and demands of the public.
The folk arts of Telangana are true examples of that sort and have survived against all odds with the patronage, support and encouragement from the people and conquered the threat of extinction.
అలా తెలంగాణలో కుల వ్యవస్థ ప్రకారం ఆయా వృత్తులు లేదా ఆయా వృత్తుల ఆధారంగా కులవ్యవస్థ రూపొందినప్పటికీ, ఆయా కులాలలో, వృత్తులలోని ఔన్నత్యాన్ని పెంచడానికి ఆయా వృత్తుల కులాలకు సంబంధించిన ప్రజలలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని, స్థాయి (Status)ని పెంచడానికి ఆత్మన్యూనతను (Social inferiority) తొలగించి, సమున్నత భావనని తీసుకురావడానికి ఆశ్రిత కళారూపాలు అవసరమయ్యాయి. అందుకే జానపద కళా రూపాలు ప్రదర్శించే కథా వస్తువులన్నీ ఆయా కులాలకు, వృత్తులకు సంబంధించిన వీరగాథలుగా, వంశ పురాణాలుగా ఉండటం సర్వ సాధారణమయ్యాయి.
తెలంగాణలో వివిధ రకాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యాల నుంచి కుల వ్యవస్థ, వృత్తి వ్యవస్థ కు అనుకూలంగా ఆశ్రిత కళాకారుల వ్యవస్థ రూపొందింది. అలా నిమ్న స్థాయి దళిత సామాజిక కులాలకి ఆశ్రితంగా ఉంటూ రూపొందిన ఒక సామాజిక కళారూపమే (Social Art Form) మిత అయ్యాల్వార్లు. ఇది షెడ్యూల్ కులానికి చెందిన దాదాపు అరవై ఉపకులాలలో ఒకటిగా ప్రభుత్వంచే గెజిట్లో ప్రకటించబడిన సామాజిక వర్గం. సాధారణంగా మాలలు, మాదిగలు, దళితులు సామాజిక పరమైన న్యూనత వల్ల, వర్ణ ధర్మ విధానం వల్ల నిమ్న స్థాయి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ వారిలో సైతం సమ్యక్ జీవన విలువలు, నైతిక ప్రవర్తన, ఆధ్యాత్మిక జీవనం కోసం మేధావులైన కొంతమంది ఆధ్యాత్మిక కోవిదులు క్రమక్రమంగా రూపొందారు. వారే మితఅయ్యల్వార్లుగా ఆ తర్వాత పేరు గడించారు. అందుకే మాల, మాదిగ సామాజిక వర్గానికి ఆధ్యాత్మిక సలహాదారులుగా, మార్గదర్శకులుగా, నైతిక బోధకులుగా వీరు మనకు కనిపిస్తారు.
అలంటి మితఅయ్యల్వార్ల గురించిన సమగ్ర సమచార దర్శినే ఈ పుస్తకం!
భాషా సాంస్కృతిక శాఖ
తెలంగాణ ప్రభుత్వం
కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్.