రుద్రంగి దేవాలయంలో కార్యక్రమం మరియు దేవాలయం గురించి పత్రికలో వచ్చిన వార్తా కథనం మా పూర్వీకుల నుంచి వస్తుంది - పరాకుశం లక్ష్మీనర్సయ్య, అయ్యవారు నా చిన్నతనంలో నుంచే మా పూర్వీకులు స్వామి వారికి మాంసం నైవేద్యం పెడుతున్నారు. నేను గత 20 సంవత్సరాలుగా స్వామివారికి సేవ చేస్తున్నాను. చాలా మహిమ కలిగిన స్వామి. గ్రామంలో బయట దేశాలకు వెళ్లాలి అనుకునే వారు, దేశం నుంచి వచ్చిన వారు అందరూ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. శ్రావణ మాసంలో శనివా రాల కంటే రెండు బుధవారాలు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మాత్రమే అవకాశం - పిప్పరి మోహన్, ఆలయ చైర్మన్ శ్రావణ మాసంలో మాత్రమే స్వామివారికి మాంసం నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వీలులేని వారు మాత్రం దసరా రోజు స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. ఆలయాన్ని చాలా మంది సహకారంతో అభివృద్ధి చేశాము. రుద్రంగిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ఉత్సవ మూర్తులు మాత్రమే భక్తుల ఇంటికి నేరుగా వెళ్లి ఒడిబియ్యం స్వీకరి స్తారు. ఇందుకు మేము నామమాత్రంగా రూ.500 ఫీజు వసూలు చేస్తున్నాము. ఈ అవకాశం కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. రుద్రంగి, న్యూస్టుడే భక్తులు సాధారణంగా స్వామివారికి పూలతో పూజలు చేసి పండ్లు, ఫలహారాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పూజలు చేసినప్పుడు భక్తులు కొందరు ఉపవాసం ఉంటారు. నియమ నిష్టలతో మాంసాహారానికి దూరంగా ఉండటం చూస్తుంటాం. రుద్రంగిలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. రుద్రంగి ప్రహ్లాద పర్వతంపైన వెల సిన లక్ష్మీనరసింహస్వామికి శ్రావణ పౌర్ణమి తర వాత తప్పనిసరిగా మాంసం నైవేద్యంగా పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఒకవేళ ఆ సమ యంలో వీలుకాని వార దసరా రోజున తప్పనిసikkm రిగా మాంసం నైవేద్యంగా చూపిస్తుండటం ఇక్కడ ప్రత్యేకత. ఇది విని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా స్థానికులు మాత్రం ఏళ్ల తరబడి వస్తున్న ఆచారంగా చెబుతుండటం గమనార్హం. 213
పుట:మిత అయ్యల్ వార్లు.pdf/232
స్వరూపం