Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దంటెడబాయకనుంటె మూలదరి దొరుకును వురుకు ఓరన్నా.

7. వచ్చెపోయ్యరని, విధమొక్కటిగని కచ్చితగుణములు విడువన్నా
నిశ్చయముగ నీతల్లిగర్భము కొచ్చిన సదువే సదవన్నా.

8. తొల్లి సదువు నీ మదిలోనెప్పుడు మల్లిసదువు మనసులోన్నావు
పుల్లములో రంజిల్ల భజించితె మళ్ళీ జెన్మమింకదన్నా.

9. అద్దముకేసిన రంగులు జూచితె అండ్లమగుపడుతుందన్నా
పొద్దుబుచ్చుకొని పొయ్యేటిదాని పోకడలెందుకు మాయన్న,

10. యెన్నటికాడవని యీ సంసారము వున్న మట్టుకుంటదిరన్నా కన్నది
పున్నమావెన్నలలోపల ఉన్నది లేదన్నరొకటన్నా.

11. రాజగురునిమీది రహస్యముదెలిపితే రాకడపోకడ సున్నాన్న
యీ తేజముగా నారాయణదాసు రాజయోగి పూటీమినుమన్నా.

ఈ తత్త్వగీతం యేటికి భ్రమిసేవు అని, ఈ భూ ప్రపంచం మీద నీవు ఎన్నాళ్ళు బ్రతికినా కాటికి వెళ్ళాల్సిందేనని చెప్తుంది.

తత్త్వగీతం-13

ఇల్లు ఇల్లాంటావు ఉల్లాసపడతావు నీ ఇల్లు ఎక్కడే చిలకా

1. అల్లంతదూరాన, వల్లకాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలకా
ఊపిరున్నవాళ్లు ఊరిలోనివారు మావారు అందురే చిలకా
ఊపిరిపోగానే ఆలుబిడ్డలుకూడ నినుచూడ జంకుదురే చిలకా
ఆస్తిపాస్తులంచూ అస్తమానము నీవు కుస్తీలుపట్టెవు చిలకా
ఆరాటపడిపోకే చిలకా.

2. అస్థిరములుగూర్చి గస్తీలునీకేల ఇకనైన యోచింపుము చిలకా
డబ్బుడబ్బాంటావు ఇబ్బందిపడి డబ్బుమాయలో దిగబోకే చిలకా
జబ్బువచ్చినయముడు దబ్బుదబ్బునలాగు ఇకనైనమేలుకో చిలకా
ఇప్పుడుచచ్చినవాన్ని చూచి బావురుమంచు వాపోవనేలనే చిలకా.

3. నీదన్నదేహమే నిన్నుకాదనిపోవు నీదనేదికయేమి చిలకా
నీకునీవేగాని నీకెవ్వరు లేరు. నామాటనమ్మవే చిలకా
పేరుతెచ్చానంటూ పైకి వచ్చానంటూ వీర్రవీగకు వెర్రిచిలకా
నిశ్వాసనీవెంత నీపేరు ఎంతెంత ఇకనైన యోచింపుము చిలకా.

4. సారమేలేనట్టి సంసారవలయాన చిక్కిపోక్కగానేల చిలకా
నారుపోసినవాడు దేవుడున్నాడంచు నోరారచాటవే చిలకా
అలుబిడ్డలంచు అస్తమానము నీవు ఆరాటపడిపోకె చిలకా.

199