మొసేటి నలుగురు అయ్యలనుకుంటూ, అప్పలనూకుంటూ
సామ్రాజ్యపదవితో సాగనంపత్తురే చిలుకా
ములుకచెట్టుక్రింద మున్నూటరవై బాట ఏబాట బోదువే చిలుకా
దండిగా గోరూరు గోవిందునికి నీవు దండం అర్పించవే చిలుకా.
ఈ తత్త్వగీతం ఇక్కడ మానవుడిని చిలుకతో పోల్చి మరణం తరువాత వచ్చే స్థితిగతులను తెలుపుతూ కొనసాగుతుంది.
తత్త్వగీతం-11
1. జడియకురా కష్టంబులకు వెతపడుటెందుకు నష్టంబులకు
అడుగుదప్పక నుడుగుదప్పక వడవలసిన శ్రమ పడవలసినదే.
2. కలకాలము హరికృపయనుకో చలిగంజైనను పాయసమనుకో
కలలోనైనను కష్టసుఖంబులు తెలివితోడనే తేలిపోగలవు.
3. దారిద్య్రము వెంట్రుక సమము, సత్యము మాత్రము తరుగని ధనము
కారణాకారములు కాకమానవు పారమార్థమెప్పటికి దప్పవు.
4. శతవిదములు ధైర్యము జెడకు సంసార బాధలకు తడబడకు
గతిలేక వాగ్ధానము చెప్పకు బ్రతుకలేక పాపంబు జేయకు.
5. రామసింహమె వరకవినై వైరాగ్యజ్ఞానమే మనోరవినై.
స్వామి కరుణగల క్షత్రియుడైనను లేమికి భయపడలేమి జన్మమిక.
ఈ తత్త్వగీతం జీవితాంతం ధైర్యముతోనే ఉండు చిన్న చిన్న కష్టాలకు జంకకు. అంతా దేవుడి మాయ అంటూ సాగుతుంది.
తత్త్వగీతం-12
1. యేటికి భ్రమసెవు - ఎన్నాళ్లుండిన కాటికిబొయ్యేది నిజమన్నా
కూటికి, గుడ్డకు, కులబేధంబని - కూతలుగూయకురోరన్న
2. దొరికిన్పుడె గురుచరణంబుల దర్శనమిడవకురోరన్న
వురికెటిదెమో వురుకుచుండగను వున్నదాన్ని నిలబెట్టన్న.
3. యెందుకు జన్మమువచ్చెనో దీని సందుదెలుసుకోవేమన్నా
ఈనింద ద్రోసె మాయనంటికానంద పదవిజేరుటకన్నా
4. మంటిలోదిరిగె కుమ్మరిపురుగును అంటరిమన్నెమిటికన్నా
రెంటిసందునా కుంటెనుగాడె - అంటికినాయెనుచూడన్న
5. సాకరముగనీవు సంకలుగొట్టెవు - శోకప్రపంచముమాయన్నా.
యిదిఆకరు జన్మాముంచనుకొని నీవు నిరాకరునిగనినిల్వన్న.
6. అంటకతిరిగె విధమొకటున్నది అది సద్గురువులకాడగన్నా
- c|198}}