అనుబంధం - A
తత్త్వగీతాలు
కడ్డీతంత్రీ వాద్యం, యక్షగానం కాకుండా మిత అయ్యల్వార్ కళాకారులు తత్వగీతాలు మంగళాహారతుల పాటల్ని కూడా ప్రత్యేకంగా ఆలపిస్తారు. వాటిలో ప్రముఖమైనవి ఇవి.
తత్త్వగీతం-1
ప. తానెవ్వరో తనవారెవ్వరో
మాయ తనువుకు జీవికి తగులాయే మనసా
దినమె మరణమని తెలియుడి ॥ తానెవ్వరో ॥
చ. మట్టి ప్రమిదలోన వెలయ చమురుపోసి
పెట్టిరి జ్యోతి ప్రేమతోటి
వెలిగి వెలగినంక మలిగిపోయెటప్పుడు
ప్రమిదతో ఒగ మాట చెప్పి పోయినదా॥ తానెవ్వరో ॥
చ. గాలి కంపదెచ్చి కాకి గూడుబెట్టి
గూటిలోన రెండు గుడ్లు బెట్టె
గుడ్లు పగిలిపాయె పిల్లలెగసిపాయె
గూటితో ఒక మాట చెప్పి పోయినదా॥తానెవ్వరో౹౹
3.గుట్ట చుట్టు తిరిగే రట్టాడి ఆ ఈగ పెట్టెను ఒక తెట్టె
ప్రేమ తోటి తెనే తాగిపాయె ఈగ లెగసిపాయె
తెట్టెతో ఓగ మాట చెప్పి పోయినదా॥తానెవ్వరో॥
4.చిత్తస్వాతి వాన ఏకమై కురియగా
చిప్పెల పడ్డాది ఒక చినుకు
చిప్ప పగలిపాయె ముత్యమెగసిపాయె
చిప్పతో ఒక మాట చెప్పిపోయినదా॥తానెవ్వరో॥
ఈ గీతంలో చివరికి మనతో ఎవరూ రారు అనేది అర్థమవుతుంది. అలాగే చిన్న చిన్న ఉదాహరణలతో కాకి గూడుకట్టి రెండు గుడ్లు పెట్టగా, ఆ గుడ్లు పగిలి పిల్లలై గూటితో<references
191