Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాడతారు. ఈ వెదురు పుల్లలను కడ్డీతంత్రీ వాద్య కళాకారులే స్వయంగా తయారుచేసుకోవడం విశేషం. కుడిచేతితో పట్టుకొనె వెదురు పుల్లకు గజ్జెలు కూడా ఉంటాయి. దీనిని “గజ్జెల పుల్ల” అంటారు. ఎడమ చేతిలో పట్టుకొనే వెదురు పుల్లను “చిటికెల పుల్ల” అంటారు. కుంభం మీద శంకుచక్ర నామాలు కూడా ఉంటాయి. ఈ వాద్యాన్ని వాయిస్తున్నప్పుడు నాట్యం చేసినట్లు భ్రమ కలిగించే విధంగా ఉంటాయి.

ఈ వాద్యంతో డోలక్, గిటార్, సంత్కర్, టుమ్రీ, సితార, వీణ, మృదంగ శబ్దాలను సైతం వాయించే వాద్య కళాకారులు లేకపోలేదు. అది ఈ వాద్యం విశిష్టత.

ఈ వాద్యాన్నిపయోగించి మిత అయ్యల్ వార్లు తిరునామాలు ఆలపిస్తారు.

మధ్యలో ఈ వాద్యాన్ని పెట్టుకొని చుట్టు వున్నవాళ్ళు డోలక్, తాళాలతో శృతి కలుపుతూ తిరునామాలు ఆలపిస్తారు.

ఈ కడ్డీ వాద్యానుపయోగించే ఈ కులం వారు యక్షగానాలు చేస్తుంటారు.

ఏదైనా దిన వారాలకు వెళ్ళినప్పుడు కూడా కళాకారులు ఖచ్చితంగా ఈ వాద్యాన్ని తమ వెంట తీసుకొని వెళ్ళి అక్కడ కొన్ని నిర్వహణపరమైన తిరునామాలు, తత్త్వగీతాలు ఆలపించి వస్తారు. మిత అయ్యల్ వాళ్ళ ఇంట్లో ఇప్పటికి ఇది దర్శనమిస్తు ఉంటుంది. అది అటక మీద చాలా కొద్ది మంది కళాకారులు మాత్రమే దీనిలో ఆరితేరిన వారున్నారు. సరియైన జనాధారణ లేకపోవడం వల్ల ఈ అమూల్యమైన కడ్డీతంత్రీ వాద్యం మూలన పడింది. 16 జూలై, 2000 నాడు వార్తా ఆదివారం సంచికలో "మనకు తెలియని మహ వాద్యం కడ్డీతంత్రీ" అనే అర్టికల్ వచ్చింది.

10. కడ్డీతంత్రీ కళాకారులు

తెలంగాణలో ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన కళ. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే దర్శనమిస్తారు ఈ కళాకారులు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే ఇంకా ఈ కళను నమ్మి బ్రతుకున్న వాళ్ళు లేకపోలేదు. అక్కడక్కడ మాలవాండ్లకు పౌరోహిత్యాన్నికి వెళ్ళి ఈ కడ్డీతంత్రీతో తిరునామా కాలక్షేపం చేస్తున్నారు.

జానపద కళాకారుల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ఆ తరువాత జీవించడానికి ఏ ఆధారం లేక బ్రతుకును సగంలోనే ముగించిన వారు కూడా ఉన్నారు. ఆ కోవకు చెందిన వారు తుమ్మపురి రామస్వామి గారు. ఈయన ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి మండలం, వడ్డాడి గ్రామానికి చెందిన వారు. ఈయన 1947లో జన్మించారు. ఈయన తన తాత ద్వారా ఈ కళను ఒంటపట్టించుకున్నారు.

రంగయ్య కళలో మహా విద్వాంసుడు ఆయన కడ్డీతంత్రీ వాద్యంపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ముప్పయి రెండు స్వర చ్ఛాయలు వినిపించే వాడట. తాతగారి దగ్గర వారసత్వంగా ఈ కళను స్వీకరించిన రామస్వామి గారు ఏకతాళం, రూపకం, ఆట, ఆదిజంపే వంటి ఏడు తాళ

178