కళలుగా వర్గీకరించి వివరించారు. వీటిలో మొదటి తెగకు చెందినవి. మానవ శరీర సౌందర్యమునకు, రెండవ తెగకు చెందినవి మానవ హృదయాన్ని ఆనందపరచుటకు తోడ్పడును. మొదటి రకం వాటిని సామాన్య కళలని, రెండవ రకం వానిని లలిత కళలని చెప్పుచున్నారు.
లలిత కళలను ఆంగ్లములో FINE ARTS అను పదానికి పర్యాయపదంగా వాడుతున్నారు. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కావ్యం అను కళలు లలిత కళలు అంటారు. మనం చర్చించుకొనే అంశము సంగీతం. సంగీతం వినడం ద్వారా మనసుకుఎంతో ఆహ్లాదము కల్గును. ఇది స్వరమయమైనది. మానవులే కాక ప్రాణమున్న జంతుజాలమును కూడా తనవైపు ఆకర్షించుకొనగల శక్తి ఉంది ఈ సంగీతానికి అందుకే “శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి" అను నానుడి కూడా ప్రచారంలో ఉంది. పాశ్చాత్యులు లలిత కళలన్నింటికి సమానమైన ప్రాధాన్యము ఇచ్చారు. భారతీయులు చిత్రలేఖనం, శిల్పము కంటె సంగీతమునకు, నృత్యమునకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ కోవకు చెందినదే ఈ కడ్డీతంత్రీ వాద్యము ఇది వీణను పోలి ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇది ఎవరు వాయిస్తారో వారు స్వంతగా దగ్గరుండి మరీ చేయించుకుంటారు మిత అయ్యల్వార్లు.
9. కడ్డీతంత్రీ వాద్యం
మిత అయ్యల్ వార్లు సంగీత ప్రియులు కనుక ముందుగా మూలపురుషుడైన తిరుప్పాణ్యాళ్వార్ల చేతిలో ఏక తార ఉండేది. కాని వీళ్ళు వీణను కొంచెం మార్పు చేసి ఈ కడ్డీతంత్రీ వాద్యాన్ని వారే స్వయంగా సృష్టించామని చెప్పుకున్నారు. ఈ కడ్డీతంత్రీ వాద్యానికి మిత అయ్యల్ వార్లు “వకుళాభరణం”, అని శోభను అంత సంతరించుకునేలా వారు దానికి నామకరణం చేసారు. కాని తరువాతి కాలంలో ఈ వాద్యానుపయోగించి కొందరు ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా దానికి (All India Radio) ఆకాశవాణి వారు కడ్డీతంత్రీ వాద్యమని నామకరణం చేశారని క్షేత్ర పర్యటనలో తెలుసుకున్నాను.
కొందరు దీనిని తంబుర అని కూడా అంటారు. బిరుదురాజు రామరాజు గారు కటి వాద్యమన్నారు. కర్నాటి గారు తంబుర అన్నారు. మిక్కలినేని రాధాకృష్ణమూర్తి గారు కడ్డీ వాద్యమని అన్నారు. ఇలా రకరకాల పేర్లతో కడ్డీతంత్రీ వాద్యముగా పిలిచారు. ఇది ముందుగా చెప్పినట్లు అచ్చు వీణను పోలి ఉంటుంది. దీనికి నాలుగు తంత్రులుంటాయి. ముందుగా రెండు కొంత లావుగా ఉంటాయి. వీటికి మందరం అని పేరు. '3' వ దాని పేరు మూట, నాలగవ దాని పేరు పాట. ఇవి ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎక్కువగా ఈ వాద్యాన్ని క్రింద పెట్టి వాయిస్తారు. క్రింద పీఠం ఆధారంగా ఉంటుంది. అది ఎక్కువగా నెమలిపింఛం ఆకారంలో ఉంటుంది. దీనిని వాయించడానికి రెండు ప్రత్యేకమైన వెదురు పుల్లలను
177