Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివరించువారు) పాటలోని కథాంశమును, ప్రాసంగికులతో మాట్లాడం ద్వారా ప్రేక్షకులకు వివరించెదరు. బయలాటలో నృత్య, అభినయాలు ముఖ్యాంశాలు. ఇందులో సంభాషణలకు ప్రాధాన్యతను ఇస్తారు. బయలాటలో వచనమునకు పరిమితి ఉంది. తాళమద్దలలో లేదు. తాళమద్దలలో వచనమే ప్రాధాన్యం.

7. ప్రముఖ యక్షగాన కళాకారులు

భాగవతార్లు: నెబ్బూరు నారాయణ, డి. ఉప్పూరు నారాయణప్ప, కడతోక మంజునాథ భాగవతార్, డి. గుండి కాళింగ నాయుడు, సుబ్రహ్మణ్యేశ్వర, నారాయణ శబరాయ, బలిప నారాయణ భాగవతారు, దామోదర మండెచ్చ, పోళ్య లక్ష్మీనారాయణ శెట్టి, కొళగి కేశవ హెగ్దే, లీలావతి బైపాడిత్తాయ (ఏకైక వృత్తిపర మహిళా భాగవతారు), పద్యాణ గణపతి భట్, దినేశ అమ్మణ్ణాయ, పుత్తిగే రఘురామ హెుళ్ళ.

హిమ్మేళ కళాకారులు: డి. నెడ్లే నరసింహ భట్, కె. హరినారాయణ బైపాడిత్తాయ, కుద్రేకూడ్లు రామ్ భట్, కేశవ బైపాడిత్తాయ, మోహన బైపాడిత్తాయ, పద్యాణ శంకరనారాయణ భట్, అడూరు గణేశ్ రావు.

పాత్రధారులు: డి.కెరెమనే శివరామ హెగ్దే, కెరెమనే మహాబల హెగ్దే, కెరెమనే శంభు హెగ్దే, చిట్టాణి రామచంద్ర హెగ్దే, కొండదకుళి రామచంద్ర హెగ్దే, ఐరోడి రామ గాణిగ, మంటప ప్రభాకర ఉపాధ్యాయ, గోడే నారాయణ హెగ్దే, బళూరు కృష్ణయాజీ, జలవళ్ళి, కణ్ణిమనే గణపతి హెగ్దే, భాస్కర జోషి, కుంబ్లే సుందరరావు, వాసుదేవ సామగ, బణ్ణద మహాలింగ, చంద్రగిరి అంబు, సుబ్రహ్మణ్య హెగ్దే చిట్టాణి, సిద్ధకట్టె చెన్నప్ప శెట్టి, కె. గోవింద భట్, కోళ్యూరు రామచంద్రరావు.

తాళ మద్దెల: శేణి గోపాలకృష్ణ భట్, మల్పే లక్ష్మీనారాయణ సామగ, డా.ప్రభాకర జోషి, కీరిక్కాడు మాస్టర్ విష్ణు భట్, దేరాజే సీతారామయ్య, డా. రమానంద బనారి, యు. బి. గోవింద భట్, జబ్బర్ సమో సంపాజె, ఎం.ఆర్.అమాచి

ప్రముఖ యక్షగాన మేళాలు: శ్రీ దుర్గా పరమేశ్వరి దశావతార యక్షగానమండలి, శ్రీ ఇడగుంజి మహాగణపతి యక్షగాన మండలి, కరమనె, సాలిగ్రామమేళ, పెర్డురుమేళ, కూండదకూళి మేళ, ధర్మ స్థలమేళ.

8. మిత అయ్యల్వార్ల కళలు - కళాకారులు

ప్రతి వ్యక్తికి ఒక కళ ఉండడం సహజం. ఆ కళను గుర్తించి కాపాడుకోవడం అనేది ఎంతో ముఖ్యం. అనాది కాలం నుండి మానవుడుకి తన జీవితంలో ఈ కళలు వెంటే ఉన్నాయి. కొన్ని ఆనందము కోసము సృష్టించినవి అయితే మరికొన్ని ఉపయోగం కోసం సృష్టించుకొన్నవి. ప్రతిభా నైపుణ్యము రెండింటి కలయకతో ఈ కళలు కనబడుతున్నవి. ఈ కళలును 64

176