Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది. ఎన్నో యేళ్ళుగా కేలికె, ఆట, బయలాట, దశావతార మొదలగు వివిధ పేర్లతో ప్రదర్శించబడే ఈ కళకు 200 యేళ్ళ క్రితం యక్షగానమనే శాస్త్రీయ నామం ఇవ్వబడింది. భక్తి ఉద్యమం జరిగే సమయంలో ఉన్న శాస్త్రీయ సంగీతం ఇంకా నాటక కళ యక్షగానంగా పరిణితి చెందాయన్నది ఒక నమ్మకం. గత కొద్ది కాలంగా బెంగుళూరులో యక్షగానం బాగా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వానాకాలంలో-ఇదే సమయంలో కోస్తా ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుగుతాయి. యక్షగానం వ్యుత్పత్తి ప్రకారం ఒక యక్షుడి పాట (గానం). ఇక్కడ యక్షుడంటే ప్రాచీన భారతదేశంలో నివసించే అడివిజాతి మనిషి అని అర్థం వస్తుంది. యక్షగానంలో నేపథ్యంలో హిమ్మెళ (హిందెం మేళ) నేపథ్య సంగీత సమూహం ఇంకా ముమ్మెళ (ముందెం మేళ) నృత్య, సంభాషణ గుంపు ఉంటాయి. ఈ రెండు గుంపుల సమన్వయమే యక్షగానం. హిమ్మెళలో ఒక భాగవత గాయకుడు (ఇతనే దర్శకుడు-ఇతనినే మొదలనే వేష (మొదటి వేషగాడు) అంటారు), మద్దెల వారు, హార్మోనియం (ముందులో హార్మోనియం స్థానంలో పుంగి అనే వాయిద్యాన్ని వాడేవారు) వాయించే వ్యక్తి, ఇంకా చండె (పెద్ద ధ్వని చేసే డప్పులు) వాయించేవారు ఉంటారు. సంగీతం మట్టు, యక్షగాన తాళాలతో రంగరించిన కర్ణాటక సాంప్రదాయ రాగాలపై ఆధారపడి ఉంటుంది. యక్షగాన తాళాలే తరువాతి రోజుల్లో కర్ణాటక సంగీత తాళాలుగా మార్పుచెందాయన్నది ఒక మాన్యత. ఉపాఖ్యానము B యక్షగానములో ఏదైనా ఒక కథను ఎంచుకొని దాన్ని జనాలకు గాన, అభినయ, నృత్య రూపాలలో ప్రదర్శిస్తారు. ఇలా ఎంచుకొన్న కథను ఉపాఖ్యానమని పిలుస్తారు. కన్నడలో ప్రసంగ అందురు. ఉదాహరణకు మహాభారతములో భీముడు, దుర్యోధనుని మధ్య గదాయుద్ధ కథను ఎంచుకొన్నచో దానిని "గదాయుద్ధ ఉపాఖ్యానము” (కన్నడలో గదాయుద్ధ ప్రసంగ) పౌరాణిక ఉపాఖ్యాలనే ఎంచుకున్నా, యక్షగానమందు ఉపాఖ్యానం/ఉపకథ/కథనము పౌరాణికమే అవ్వాలనే నియమము లేదు. అది ఐతిహాసికము లేక సామాజికము కావొచ్చు. అంటారు. పాత్రధారులు ఉపాఖ్యానంలో వచ్చు కథకు అనుగుణంగా అభినయించు, నర్తించు నటులను/నర్తకులను పాత్రధారులు అంటారు. ఉపాఖ్యానంలోని కథానుసారం నాయకుడు, దుష్టనాయకుడు, హాస్యగాళ్ళు, స్త్రీపాత్రలు ఇత్యాదులను ఆయా పాత్రల కనుగుణంగా ఎన్నుకొనెదరు. నృత్యం, అభినయం/నటన, మనస్సుకు హత్తుకొనే చతుర సంభాషణలతో 173