Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశ్వకర్మ కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. వీరిని బొమ్మలాటవారు అని పిలవడం కూడా ఇప్పటికీ ఉంది. చెక్కబొమ్మలాట కూడా ప్రాథమికంగా యక్షగాన ప్రక్రియ. ప్రదర్శన కళలలో మానవేతర పాత్రధారులతో ఉన్న కళారూపాలు తెలుగు సంప్రదాయంలో ఎలా ఉన్నాయో చూశాము. ఇక్కడ ప్రస్తావించే కళారూపాలు కొన్నింటి గురించిన విషయాలు ఈ గ్రంథం లోనే ఉన్నాయి.7 ఇవికాక ఇక్కడ ప్రస్తావించవలసిన వైవిధ్యం ఉన్న కళారూపాలు సంగీత ప్రధానమైన కళారూపాలు కొన్ని ఉన్నాయి. ప్రదర్శనకు తావు ఉన్నా ఇందులో వాద్యానికి సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కోలాటం, వివిధ రకాలైన భజన సంప్రదాయాలు ప్రదర్శనతోపాటు సంగీతానికి ప్రాధాన్యం ఉన్న కళారూపాలు. ఇంకా వివిధ నృత్య సంప్రదాయాలు గిరిజన నృత్య సంప్రదాయాలు మనకు ఉన్నాయి. తెలుగునాట ఈ విధంగా జానపద ప్రదర్శన కళలలో అత్యంత వైవిధ్య భరితమైన ప్రదర్శన సంప్రదాయాలు ఉండడం చాలా ప్రాచీనమైనవిగా ఉండడం వివిధ కళాపరిణామ క్రమాలను తెలిపే కళారూపాలు ఉండడాన్ని గమనించవచ్చు.

5. ప్రదర్శన వాద్య పరికరాలు

తంబుర : ఒక విధమైన తంత్రీ వాద్య పరికరం. ఇది చూడడానికి వీణ మాదిరిగా ఉంటుంది. తంబుర అనగా ఒక తంత్రీ వాయిద్యం. ఇందులో చాల రకాలున్నాయి. సొరకాయ బుర్రతో చేసిన వాటికి రెండు లేద ఒక తంత్రి మాత్రమే వుంటుంది. వీటిని తత్వాలు పాడేవారు ఎక్కువగా వాడుతారు. దీనిని వాడటానికి పక్క వాద్యాలతో పని లేదు. కేవలం తాళాలు మాత్రం ప్రక్క వాయిద్యంగా వుంటే సరిపోతుంది.

ఇంకో రకం : దీనికి అనేక తంత్రులు కలిగి కర్రతో చేసినదై ఉంటుంది. వీటిని బుర్ర కథకులు, ఒగ్గు కథకులు ఉపయోగిస్తారు. దీనిని ప్రక్కవాయిద్యాల తోనే ఉపయోగిస్తారు. దీనికి ప్రక్కవాయిద్యానికి తప్పని సరిగా గుమ్మెత్త వుంటుంది.

6. యక్షగానం

నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత. ఇది ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని అతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ. కరావళి జిల్లాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలలోనూ శివమొగ్గ, కేరళ లోని కాసరగోడు జిల్లాలు యక్షగానానికి పట్టుగొమ్మలుగా చెప్పవచ్చు. యక్షగాన ప్రదర్శన సాయంత్రం వేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికి ఆటకు మొదలు దాదాపు రెండు గంటలపాటు డప్పు కొడతారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు, తలపై సవరం ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కువగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ చెబుతుండగా, వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుగుణంగా నటీ నటులు

172