గొల్లలకు ఆశ్రితులైన వారిలో కూడా మరింత భిన్నమైన కళారూపం ఉంది. వారు కథలోని పాత్రలను కొన్ని బొమ్మలుగా చేసి వాటిని ముందు పెట్టి ప్రదర్శిస్తూ కథను చెబుతారు. కళాప్రదర్శన పరిణామ క్రమంలో తోలు బొమ్మలాటను ఈ పటం కథలకు తొలి రూపాలుగా చెప్పడానికి వీలుంది. తోలుబొమ్మలాటను ప్రక్రియా పరంగా మరింత పరిణామం పొందినదిగా చెప్పడానికి వీలుంది. ఇలా పట ప్రదర్శన కళలు తెలుగు జానపద ప్రదర్శన కాళారూపంలో మంచి సంప్రదాయంగా చెప్పడానికి వీలుంది. తర్వాత ప్రదర్శన కల క్రమంలో వీధినాటక ప్రక్రియను నాటకి తర్వాత స్థానం పొందిన దానిగా చెప్పడానికి వీలుంది. ఇందులో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పాత్రను గ్రహించి కథను నడిపే వీలుంది. అంతే కాక పూర్తి స్థాయి అభినయానికి కూడా ఇక్కడ స్థానం ఉంటుంది. ఆహార్యం ఇతర ప్రదర్శన వస్తువులు ఇతరత్రా సౌకర్యాలు రంగోద్దీపనలు ఏమీ లేకుండానే అన్నీ ఉన్నట్లుగా భావింపజేస్తూ ప్రదర్శించడానికి వీలున్న నాటకరూపంగా వీధినాటకాన్ని చెప్పడానికి వీలుంది. తెలుగులో భిన్నమైన వీధినాటక రూపాలు వేరు వేరు ప్రాంతాలలో ఉన్నాయి. తెలంగాణా సర్కారు ప్రాంతాలలో ఉన్న వీధినాటకాలు, రాయలసీమ అనంతపురం ప్రాంతాలలో ఉన్న బయలాటలు, కుప్పం వీధినాటక ప్రక్రియ ఇలాంటివి. వీటికి ప్రత్యేకంగా రంగస్థలం అక్కర లేదు. వాలకం కూడా వీధినాటక ప్రక్రియ అయినా ఒకే కళాకారుడు ఉండడం అక్కడి ప్రత్యేకత. ఇక ఈ తరహా వీధినాటక రీతి ప్రదర్శన కళా సంప్రదాయాల తర్వాత మరింత పరిపూర్ణంగా పూర్తినాటకానికి పూర్తిగా చేరువ అయిన కళారూపాలు యక్షగాన ప్రదర్శన కళలు తెలుగులో భిన్నమైన యక్షగాన కళారూపాలు ఉన్నాయి. అన్ని పాత్రలకు పాత్రధారులు ఉండి పూర్తి ఆహార్యం ఉండి రంగస్థలాన్ని కూడా పరిణతంగా ఏర్పాటు చేసుకొని ప్రదర్శించే కళారూపం యక్షగానం. కొన్ని యక్షగాన ప్రదర్శలనకు ప్రత్యేకించి రంగస్థలం అవసరం లేకుండానే వీధిలో కూడా ప్రదర్శించవచ్చు. కాని ఇక్కడ పాత్రలు పాత్రధారణలు పూర్తిగా ఉండడాన్ని గమనించాలి. ఈ తరహా యక్షగానాలలో చిందు యక్షగానాన్ని తొలిగా ఉదహరించవలసి ఉంటుంది. చిందు యక్షగానాన్ని తెలుగులో ఉన్న అన్ని యక్షగానాలలోనికెల్లా ప్రాచీనమైనదిగా చెప్పడానికి వివిధ చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. చిందు యక్షగానం ఈ నాటికి కూడా వన్నెతరగకుండా ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. తెలంగాణా యక్షగాన ప్రక్రియ కూడా చిందు యక్షగానానికి చాలా దగ్గరగా ఉంటుంది. కర్ణాటకలో ఈనాడు బహుళ ప్రచారంలో ఉన్న యక్షగాన శైలి చిందు యక్షగాన శైలికి చాలా దగ్గరగా ఉండి చిందు యక్షగానంనుండి అభివృద్ధి చెందినది అని చెప్పడానికి వీలుగా కనిపిస్తుంది. చిందు యక్షగానం తెలంగాణాలో బహుళ ప్రచారంలో ఈనాటికీ ఉంది. ఇక కూచిపూడి యక్షగానం ఈ కాలంలో బాగా పరివర్థితమై ఆధునికమై శాస్త్రీయ ప్రదర్శన సంప్రదాయం అనే పేరు తెచ్చుకున్నా ఇది ప్రాచీన కాలంనుండి ఉన్న 170
పుట:మిత అయ్యల్ వార్లు.pdf/189
స్వరూపం