Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదలైనవాటిలో వీరి కుల ప్రత్యేకత కనిపిస్తుంది. ప్రధానంగా వీరి భాషా సాహిత్యాలను ముఖ్యంగా ఏడు భాగాలుగా వర్గీకరించి, పరిశీలించవచ్చు. అవి 1. సంకేత భాష 2. జాతీయాలు -పలుకుబళ్లు 3. సామెతలు 4. పొడుపు కథలు 5. కథలు 6. గేయాలు 7.మిత అయ్యల్వార్ల తిరునామాలు, రచనలు.

మిత అయ్యల్వార్ల ఉపకులాల జానపద కళారూపాల్లో, ప్రదర్శనల్లో, పాటల్లో, పద్యాలలో మనకు అనేక రకాలైన భాషావిశేషాలు కనిపిస్తాయి. ధ్వనిపరిణామం, మాండలికాలు, జంటపదాలు, వారానువర్తనాలు, ఛందోరీతులు, జాతీయాలు, విచిత్ర పదబంధాలు, అన్యదేశ్యాలు, సామెతలు, వాడుక పదాలు, ధ్వన్యనుకరణ పదాలు, పలుకుబళ్ళు, ద్విపద, మంజరీ ద్విపద మొదలైనవి ఈ క్రింది విధంగా కనిపిస్తాయు.

3. ధ్వని పరిణామం

సాధారణంగా ఏ కులానికైనా మరియు వారి ఉపకులాల జానపద కళాకారులు ప్రదర్శనల్లో, వాడుక భాషల్లో ధ్వని పరిణామం ఈ విధంగా వుంటుంది. అలాగే మిత అయ్యల్ వార్లలో కూడా ఈ విధంగానే ఉంటుంది

''చ'కారం 'స'కారంగా మారుటా

చూడు సూడు
చక్కదనం సక్కదనం
చీమలు సీమలు
చేన్లు సేన్లు
ఏమిచేతు ఏమిసేతు
చెల్లెమ్మ సెల్లెమ్మ
పొడిచేపొద్దు పొడిసేపొద్దు

పదాది 'వ 'కార లోపం

వాళ్ళు అల్లు
వచ్చి అచ్చి
విప్పిన ఇప్పిన
వాన ఆన
విందు ఇందు
విషం ఇసం
వచ్చినారు ఒచ్చిండ్రు, అచ్చిండ్రు
విలువిద్యలు ఇలువిద్యలు
వినవె ఇనవె

150