అలాగే మన పూర్వీకులనుండి వారసత్వంగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలనూ, మన కట్టుబాట్లనూ, విలువలను కూడా ఎప్పటికీ మరచిపోలేము. భారతదేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. మన తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను చాలాకాలం పూర్వమే చాలామంది గుర్తించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా వారసత్వంగా వస్తున్న మన తెలుగు భాష దేశవిదేశాల్లో మాట్లాడేవారి సంఖ్య ఈనాడు 16 కోట్లకు పైగా పెరిగింది. భారతదేశంలో హిందీ భాష తరువాత ఎక్కువమంది మాట్లాడే రెండవ భాష మన తెలుగు భాష. "ఆరు బయట చల్లని పిండివెన్నెల్లో చందమామను చూపుతూ, గోరుముద్దలు తినిపిస్తూ అమ్మ నాకు నేర్పిన భాషే తెలుగు భాష, అమ్మ భాషే అమృతం. ఏ వ్యక్యి అయినా గుండె లోతుల్లోంచి వచ్చే భావాన్ని మనసు విప్పి చెప్పగలిగేది మాతృభాషలోనే. స్వంతభాషపై పూర్తిగా పట్టు ఉంటేనే ఇతర భాషలపై పట్టు దొరుకుతుంది. ఈనాడు ఒక భాష అంతరించిందంటే ఆ జాతి యావత్తు అంతరించినట్టే. కన్నతల్లిని మనము ఎన్నడూ మరువలేనట్లే తల్లి భాషను కూడా ఎనాడు మరువకూడదు. తుపాకి శరీరాన్ని లొంగ తీసుకుంటే, భాష ఆత్మను లొంగతీసుకుంటుంది. ఒక భాషను దూరం చేయటమంటే ఆ జాతి సంస్కృతిని దూరం చేయటమే. పరమత ద్వేషం ఎంత నీచాతి నీచమో, పరభాషా వ్యామోహం కూడా అంతే నీచం. పరాయి భాష మెదడునుండి శరీరాన్ని, మనసు నుంచి మెదడును విడదీస్తుంది. మాతృభాషను ప్రేమించలేనివాడు, మాతృదేశాన్ని కూడా ప్రేమించలేడు. తెలుగు భాష వాడుక మన జాతి మనుగడకు వేడుక కాగలదు. విద్య, సాహిత్య, సాంస్కృతిక రంగాల ద్వారా తెలుగు భాషను ప్రోత్సహించినప్పుడే ఆ భాష పది కాలాలపాటు జీవిస్తుంది. అమ్మపాల కమ్మదనంతోపాటు అచ్చతెలుగు మకరందాన్ని మన ముందుతరాల వారికి అందిద్దాం.” 2. భాషా సాహిత్యాలు భాష భావ వినిమయానికి తోడ్పడే సాధనం. ఒక జాతి ప్రత్యేక లక్షణాల్లో భాష మొదటిది. ఆ జాతికున్న ప్రత్యేకమైన భాష, ఇతరజాతుల నుంచి ఆ జాతిని వేరుచేసి చూపుతుంది. భాషలో విలక్షణాన్ని చూపేవి మాండలికాలు. వీటిలో కుల మాండలికాలు ఎంతో వైవిధ్యం చూపుతాయి. ప్రాంతీయ మాండలికాలు కూడ కుల మాండలికాల మీద ప్రభావం చూపినా, సాధారణంగా ఒక్కో కులానికి ఒక్కో ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. 'భాషతోపాటు పలుకుబళ్ళు, సామెతలు, పొడుపు కథలు, కథలు, గేయాలు మొదలైన సాహిత్య సంపదను' అధ్యయనం చేయటంవల్ల ఆ జాతి జీవన విధానాన్ని, సంస్కృతిని అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. అదే విధంగా ఒక కులానికి సంబంధించిన సాహిత్య సంపదలో ఆ కులంవారి జీవన విధానం, వారి సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ప్రధానంగా తెలుగు మాట్లాడే ప్రతి జాతికి, కులానికి కొన్ని సంకేత పదాల్లాగా కొన్ని ప్రత్యేక భాషా పదాలున్నాయి. భాషా పదాలతోపాటు పలుకుబళ్ళు, సామెతలు, కథలు 149
పుట:మిత అయ్యల్ వార్లు.pdf/168
స్వరూపం