Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6. కులశీలములు రెంటిబట్టి వాటితలుపు తాళము పడగొట్టి
తలపుతో యతిరాజ దాస దాసులు పాద
తలము లేరికొని తెలివితోడుతను29

"దరిజేరు వారెల్లరండి ముక్తి తెరగొల్లని". ఈ తిరునామంలో ఈ ప్రపంచం అంతా మాయ అని వివరిస్తున్నట్లు ఉంటుంది. చివరికి అందరూ భగవంతుని వద్దకు వెళ్ళువారే. అప్పటి వరకు జీవించి ఉన్న ఈ శరీరం మీద మరీ అంతా వ్యామోహాన్ని పెంచుకోవడం సరియైనది కాదు అన్నట్లుగా వేదాంత ధోరణిలో సాగుతుంది. అందుకని ముక్తి పొందని వారందరూ రండి! పరమ పవిత్రులైన గురువు సన్నిధికి చేరి ఆ వైష్ణవుని దీపస్తంభము అని అర్థం. మరొక అర్థం నమస్కారం. (తిరువడిఘళ్) వద్దకు చేరి వైష్ణవ గురువైన శ్రీ రామానుజాచార్యుల దయను పొందుదము అని తెలియజేస్తుంది ఈ తిరునామం. అంతే కాకుండా రామానుజచార్యులు వారు ఈ భూమి మీద ఉద్భవించినది కూడా కుల, మత భేదాలు లేవని చెప్పడానికే అని. ఇది అంతా పరమార్థము. అటువంటి కైవల్యం శ్రీ తిరుమలేశుని పాదముల వద్ద మాత్రమే దొరకునని రామానుజ చార్యులు కూడా తెలివితో అందరికి శ్రీ వెంకటేశ్వరుని పాదసేవనం చేయడం ఉత్తమం అని దాస జనానికి హితవు చెప్పినట్లుగా ఉంటుంది ఈ తిరునామం.

నిర్వాణ తిరునామం-7


అష్ట అష్టాక్షరీ ఇంటిలోనా విశిష్టమైన వేదమున్నది
విశిష్టమైన విధియదాటారే యతిరామానుజా
నిత్యభోగమందే కలుగును మహిమదె
ఇల్లుకట్టీ మట్టిదొంతురాలుబెట్టి మరచి నిద్దుర
పోయినంతలో “యతి రామానుజా"
మన్ను మిన్ను ఒక్కటాయెనూ
నిప్పులాయేరూ దాటంగా తెప్పాలుగా తిరుమంత్రము
నిప్పుల ఏరు నీరాయెను “యతి రామానుజా”
తెప్పలుగా దాటిపోయేను
కావాలుంచేను యతి రామానుజా
దూడాలైదు చేనూమేసెను మబ్బులేనీ వానకురిసే
వరదలేని వాగుపారే కుంటనిండే పంటపండేను
కుప్పకాలే అప్పుతీరేను యతి రామానుజా
నిత్యముక్తులయి యున్నారు యతి రామానుజా

139