Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్లగాదూ మేను శాయా - ఏవేళబోవునో తెలియదయా
తల్లిదండ్రులు తనయులాప్తులు వెల్లిపోగనె వెంటరారిక
మెల్లమెల్లగా వీర్ని విడిచి నల్లనయ్యను నమ్ము28

శ్రీమన్నారాయణుని నామస్మరణ చేయండి. శ్రీమన్నారాయణుని నామస్మరణ మైమరచి చేయండి. అస్సలు మరచిపోకుండా చేయండి. ఈ సంసార సాగరమంతా కోరిక లేకుండా ఆయన నామస్మరణ చేయండి. మనం దాచుకొన్న సంపద ఏదీ మన వెంట రాదు. మనము చేసిన పాప ఖర్మలు అనుభవించక తప్పదు. నీకెంత బలమున్న అంతా శ్రీమన్నారాయణుని లీలలే అని మరవకు. విందులు, వినోదాలు అని నక్కలాగా ఆలోచించకు. నీకు ఎంత మంచి దేహ సౌందర్యం ఉన్నా అది ఎప్పటికైనా నీవు చనిపోగానే చితిమంటలలో భస్మమవుతుంది. అలాగే నీవు జీవించి ఉన్నంతవరకూ నీతో ఉన్నవాళ్ళు ఎవరూ చనిపోయిన తరువాత నీతో ఎవరూ రారు. చివరకు నీకు దిక్కు ఆ ఒక్క దేవుడే. నీ శరీరమంతా రక్త, మూత్రములు కలగలిసినదని మరవకు. దానికోసం ఆరాటపడి నీ ఆప్తులను బాధపెట్టకు, మెల్లగా వీరందరిని మరచి నీ జీవం వెళ్ళిపోతుందని మాత్రం మరచిపోకు. చివరికి మిగిలేది ఏమీ ఉండదు. కాబట్టి ఉన్న జీవితాన్ని కుళ్ళు కుతంత్రాలతో కాకుండా సన్మార్గంలో నడవమని చెప్తుంది ఈ తిరునామం.

నిర్వాణ తిరునామం-6

1. దరిజేరు వారెల్లరండి ముక్తీతెరగొల్లనివారు పొండి
పరమపావనులైన గరుని సన్నిధిచేరి
తిరువడిఘళ్ళకు శరుణు బొందుదము

2. దేహాభిమానము విడిచి యీ మోహాబ్ది మునుముట్ట గడచి
ఓహో యిది దొడ్డఉచితమనుచు దెలసి
సాహసమున దాస్యసరణి గనుంగొని

3. అహంకారమమకారమణచి నిశ్శంకతో రిపులను గెలచి
కైంకర్యమొనరించు ఘనులె దేశికులని
పొంకముతో పాదపంకజములు గెలువ

4. ఈషణత్రయమందు రోసి ప్రకృతి దోషములను విడదోసి
శేషత్వమందె విశేషమనుచు దెలసి
దోష భోగ్యుడే సర్వ శేషియనుచు నమ్మి

5. ధరణిలోపల చక్రవర్తి శ్రీతిరుమాలార్య పాదభక్తి
పరమార్థమిదియె శ్రీపరమపదంబుని
సురుచిరముగ అల్ల విరజ దాటగోరి

138