Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిర్వాణ తిరునామం-3 పల్లవి: చ|| ||చ|| ఎంతో ధన్యురాలా నైతీ ఇంతిరో ఈ వేళ నే ॥2॥ చెంత జేరి రామానుజా చార్యులూ మమ్మేలిరే పదుగు రాళ్వారులా బోలూ ప్రజ్ఞగల్గు వారాలే మదిలో అరిషడ్వర్గమూలు మమత విడుమానిరే పంచ సంస్కారములనొసగీ సంపన్నునిగా జేసిరే పంచ తత్త్వములదెలిపి ప్రపన్నునిగా జేసిరే అష్టమూర్తులను భావమూ స్పష్టముగా దెలిపిరే శిష్టజనుల గూడుటే ఉత్కృష్టమని యెంచిరే త్రివిధదాస్యమును గురుతుయెరుగుమని యెంచిరె అవిరళద్వయ భోగమే అధిక మనియెంచిరె నళినాక్షి పుల్లూరు లక్ష్మి నారసింహ రూపులే చెలియారో మౌద్గల్యాంబుధి చంద్రులౌ ప్రతాపులే * “ఎంతో ధన్యురాలనైతీ” అంటూ ఈ తిరునామంలో ఎంతో పుణ్యం చేసుకున్నాను, అందుకే రామానుజులు మా చెంతకు చేరి మమల్ని కాపాడుతున్నారు. అరి అంటే శత్రువు. అరిషడ్వార్గాలు అంటే... 1) కామము 2) క్రోధము 3) లోభము 4) మోహం 5) మదము 6) మాత్సర్యం. ఈ అరిషడ్వార్గాలను మరియు వాటి మీద మమతను విడువమన్నారు మా ఆళ్వార్లు. నమ్మాళ్వార్లు అందరూ ప్రజ్ఞను కలిగిన వారు కనుక ఇలా చెప్పారు. మా వంటి వాళ్ళకు పంచసంస్కారాలు నేర్పి మమ్మల్ని సంపన్నులుగా చేసారు. అంటే శ్రీ మహావిష్ణువుకి చిహ్నాలైన శంఖుచక్రాలను అగ్నిలో ఉంచి వైష్ణవ భక్తుల భుజాల మీద వేస్తారు. దీనితో ఆ వ్యక్తి వైష్ణవుడైనట్లుగా భావిస్తారు. అదేవిధంగా ఊర్థ్వపుండ్రాలను నుదుటిపై ధరింపచేస్తారు. వీటిని విష్ణుమూర్తి పాదాలకు చిహ్నంగా భావిస్తారు. ఇటువంటి పంచసంస్కారాలను నేర్పారు. పంచతత్వాలు (పృథ్వి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం) విడమరచి తెలిపి మమ్మల్ని ప్రకాశవంతులు చేసారు. ఇంకా సాధారణంగా సామాన్య జనాలు వేదాభ్యాసం చేయడానికి అనర్హులుగా భావిస్తారు. అటువంటిదే వీరు స్త్రీలకు కూడా వేద రహస్యాలను చెప్పటానికి ఆహ్వానించారు. అది కూడా ఏ విధంగానంటే పుల్లూరి లక్ష్మీనరసింహస్వామి, స్వర్గాన్ని జయించిన మౌద్గల్యుడు, చంద్రుడు వంటి వారు సాక్షులుగా ఈ వేద రహస్యం చెప్పడానికి అంగీకరించారని తెలియజేస్తుంది ఈ తిరునామం. అందుకనే శిష్టులైన వైష్ణవులందరూ ఒకే దగ్గర కూడుట శ్రేష్టమని భావన అని చెబుతూ శ్రవణం, కీర్తనం, వందనం వంటి వాటిని త్రివిధ దాస్యం అంటారు. ఇలాంటి దాసభక్తిని పాటించమని దీని అర్థం. 135