చూపును అని ఈ తిరునామంలో పేర్కొంటున్నారు. మొత్తానికి ఇందులో అష్టాక్షరి మంత్రం అయిన “ఓం నమో నారాయణాయ" గురించి తెలిపినట్లుగా ఉంటుంది ఈ తిరునామం.
తిరునామం-19
వీరేనా వీరేనా యతికుల పతులు వీరేనా రామానుజులు
వీరేనా వైష్ణవసిద్ధాంతము స్థాపన జేసిన ధీమతులు వీరేనా
చిదచిదీశ్వర స్వభావములా ఆభావమునందలి రూపములా
జీవేశ్వరుల సంబంధములా జగతికి దెల్పిన జగద్గురువులూ
మొదటన నంతుడటుపైన శేషులా శేషుల పిమ్మట లక్షణులూ
బలరాములునై రామానుజులై సేవాధర్మము దెల్పిన స్వాములూ
విప్రసంఘ పరిపాలకులై శ్రీమన్నారాయణ జియ్యరులై
బదరీశుని కైంకర్య నిరతులై ఇటు వేంచేసిరి మనలను కావగ20
ఈ తిరునామంలో రామానుజుల వైష్ణవ మత స్థాపన కృషిని గూర్చి పొగడడం జరుగుతుంది. ముందుగా మనం తెలుసు కున్నట్లు యతి అంటే సన్యాసి అని అర్థము. వీరేనా? వీరే యతి కులస్థాపకులు. వీరేనా రామానుజులు? వీరు వైష్ణవ మత సిద్ధాంతమును స్థాపన చేసిన ధీరులు. వైష్ణవ మత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వైష్ణవోత్తములు. వీరేనా? చిదాత్మ అంటే పరమాత్మ మరియు ఆ పరమాత్ముని స్వభాములు, ఆ జీవేశ్వరుని స్వభావములు జగతికి తెల్పిన జగత్తులు ఏలే గురువులు వీరేనా? సృష్టి మొదలైనప్పటి నుండి ఆ అవతారాలన్నీ ధరించి పూర్తి చేసి సేవాధర్మము చేయడానికి మాకోసం వెలసిన స్వాములు వీరేనా? అంటూ వైష్ణవ భక్తులు రామానుజులవారిని పొగుడుతూ సాగుతుంది ఈ తిరునామం. ఇంకా బ్రాహ్మణ సంఘ పరిపాలకులై ఆ శ్రీమన్నారాయణుని కోసం వైష్ణవ సన్యాసులై ఆ శ్రీ మహావిష్ణువుకి సేవ చేయడానికి మా కోసం మీరు భువికి దిగి వచ్చారా? అని ఈ తిరునామం యొక్క అర్థం.
తిరునామం -20
1) దండామని చెప్పరె నా స్వామిని దయవుంచమని యడుగరె
దండామని తమదాసహృత్కమల ముందుండి రక్షించు బ్రహ్మాండ నాయకునకూ
2) ఇద్దారు భార్యలకూ, పెద్దయిన మా యిందీరయనుబాలకూ
ముద్దు మొగంబున ముదమొప్పగానూ, దిద్దిన కస్తూరి తిరుమణి రేఖాకు
3) ఉరగా తల్పంబునకూ, అతడెక్కెటి గరుడవాహనమునకూ
అరుదుగా పన్నిద్దరాళ్వారులకెల్లా, శరణానిచాలగ సిరులివ్వుమని దూరె
4) చారూ భుజంబులకూ, మెప్పైనా శ్రీ శంఖచక్రంబులకూ
హారకుండలమణిహారశృంగార శరీర సద్భక్తమందార భుజంబునకూ
129