తిరునామం - 16
మాట తిరుగరాదే తమరాడిన మాట తిరగరాదే
సుగ్రీవాంగద మారుతి సాక్షి, సూర్యచంద్ర తారకములు సాక్షి
జాగ్రత్తతో దిక్పతులు సాక్షి, సత్యభూమి ఆకాశము సాక్షి
ఒక్కసారి శరణన్నవారి మరి, లెక్కలేని పాతకములు చేసిన
మక్కువతోదుత సర్వసంపదలు, నిక్కమిచ్చి రక్షింతుమనెడు
భాసుర నిగమాగమములు సాక్షి, భారతరామాయణములు సాక్షి
దాసులైన శ్రీభాగవతులు సాక్షి, వాసవాది వాల్మీకులు సాక్షి
దానవునకు పట్టము కట్టితిరి, ద్రౌపది మానంబును గాచితిరి
పూనికతో నందరిని బ్రోచితిరి పుణ్యమూర్తి వెంకటప్ప గురుని17
ఈ తిరునామంలో విష్ణువును పొగుడుతూ పాడే తిరునామం ఇది. ఇందులో మీరు చెప్పిన మాటకు తిరుగులేదు. సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతులే సాక్షులు. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు కూడా దీనికి సాక్షులు. అష్టదిక్కులను ఎల్లవేళలా కాపాడే అష్ట దిక్పాలకులు మరియు ఈ భూమి, ఆకాశాలే దీనికి సాక్షులు. ఒక్కసారి నిన్ను శరణు అన్నవారిని వారు చేసుకున్న మహా పాపాలన్నీ కూడా క్షమించి వరమిస్తే వారు ఎంతో సంతోషముతో ఉండేటట్లుగా వారికి సిరి, సంపదలను ఇచ్చి కాపాడినవాడవు అని ఈ తిరునామంలో భక్తులు కొలుచుకుంటున్నారు.
వేదములు మరియు వేదాంతములచే స్తుతింపబడినవాడు. హృదయాన్ని దొంగిలించి మంత్రముగ్ధులను చేసే రూపాన్ని కలిగి ఉన్న వ్యక్తి పర్వతరాజును (మందర) భరించినవాడు ఓ! శ్రీమన్నారాయణా! మహాభారత, శ్రీమద్రామాయణములే సాక్షి. దాసులైన వారు కూడా సాక్షి. కురుసభలో ద్రౌపది యొక్క మానాన్ని కాపాడిన ఓ మహానుభావా! నీవు గొప్పవాడవి. దయతో అందరిని కాపాడే శ్రీ వెంకటేశ్వరుడవని ఈ తిరునామంలోని అర్థం.
తిరునామం-17
కేశవ నారాయణ మాధవ హర విష్ణు పరమాత్మ నమో నమః
దాశరథి జలదాంగ జనార్థనా కులపతి నమో నమో
హరీ మాధవ సాగర శ్రయ నాంచుత వర హర రూప హరి నమో నమః
భమ జలోచన వాసుదేవ నరసింహ జగన్మమయ నమో నమో
కేశవ నారాయణ గురు శంఖచక్రాంకిత ముకుంద కృపానిధి
నమో నమో వేదవేద్య వనమాలి విష్ణుంచ సేతి రంగపతి నమో నమో
కేశవ నారాయణ
127