తిరునామం-15
శ్రీ విఠలేశ్వరా శ్రీ వెంటాచార్య శ్రీవామనరూపుడా
దాసులా బ్రోవుమీ లక్ష్మీశుదా
విఠలేశ్వర నిన్ను నేను గట్టిగానే పట్టుబడితేను సృష్టి లోపల
దాసజనులను కష్టపెట్టుట న్యాయమౌనా
1. రేపురేపని నాతో తేపతేపకు బొంకితేను నిన్ను కాపాదుకొనియు
రాఘవనా పాపము లెగజల్లు మీ
రేపురేపని నాతో తేపతేపకు బొంకితేను
మాపటికి నీదర్శనము నా పైన నిలువదా
2. నిండూ పున్నమి నాటి పండు వెన్నెల విష్ణు
బ్రహ్మండాజ నను బ్రోవుమీ - నీ చరణమూ నిండు భక్తితో గొలిచేము
నిండు పున్నమి నాటి చంద్రుని ఉండబడిన కమలజనాక
పుండరీకా పాండురంగా ఖండితంబుగా నన్నుబ్రోవు
3. ఇందిరా రవికంటి ఈశా వెంకటేశా - యందునా దయలుంచి
నీ చరణము నిందు భక్తితో గొలతునూ
ఇందిరేశా గరుడగమనా - అందముగ హరిశ్చంద్రునేలిన
మంద రాద్రిని మోసిన గోవింద భూమన్ దాసుగారు16
శ్రీ విఠలేశ్వరా! దాస భక్తితో వైష్ణవ భక్తులు శ్రీమహావిష్ణువును కొలుస్తూ పాడుకునే తిరునామం. శ్రీమహావిష్ణువుకున్న అనేకరకాలైన పేర్లతో అంటే విఠలేశ్వరా, వెంకటాచార్య, వామనరూప, లక్ష్మీశుడా, శ్రీహరి, గోవిందా, ఆపదమొక్కులవాడా, అనాథరక్షకా, వేంకటేశ్వర అని స్తుతిస్తూ మావంటి దాసులను కష్టపెట్టడం నీకు న్యాయమా దేవా? అని మహావిష్ణువును ప్రశ్నిస్తున్నట్లుంటుంది తిరునామం.రేపు రేపు అంటు నాతో అసత్యమాడుతున్నావు నీవు. నిన్ను నేను కాపాడుకుంటున్నాను. నా దోషాలు, పాపాలు ఏవైనా ఉంటే నన్ను మన్నింపుము. ప్రతిరోజు సాయంత్రంవేళ నీ దర్శనమును నాకు ఇప్పించుము.
ఒక నిండు పౌర్ణమి రోజున ఒక పండు వెన్నెలలో బ్రహ్మాండాలను ఏలే నీవు నాపైన దయచూపుమయ్యా అని వేడుకున్నట్లు ఉంటుంది ఈ తిరునామం. చివరికి ఖచ్చితంగా నువ్వు నా మీద దయచూపించాల్సిందే అని హెచ్చరిస్తున్నట్లుంది ఈ తిరునామం.
ఓ లక్ష్మీవల్లభ! నాయందు దయవుంచితే నీ పాదాలను నిరంతరం నేను నిండు భక్తితో కొలుస్తాను. మంథర పర్వతాన్ని లేపి భక్తులను కాపాడిన గోవిందా! పలు పలు రకాలుగా నేను నిన్ను సేవిస్తాను అని విష్ణువును దాసభక్తులు వేడుతున్నట్లుంది ఈ తిరునామం.
126