Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరునామం -14

రారే చూతము జనులారా శ్రీ జగన్నాథము స్వామి
మన పాలిట దేవుడమ్మా ౹౹2౹౹

చ౹౹ వారిజాక్షుడట వాసవిసఖుడట
పారావార గంభీర నేత్రుడట
మన నాథుండట - మన జనకుండట
కరివరదుండట - కనక కుబేరుడట
శరణనివేడితే కరుణబ్రోచునట

చ౹౹ అలరు పూబోణులూ రారమ్మా! అతనీ చరితము అన్నీ విందాము వేగరారమ్మా!
కలియుగమున ఆషాడ శుద్ధ స్థిరకాలము రోజున
అలరుచూ దేవేంద్రుడొచ్చునట సురలు వర్షము విరియ
గురుతురట - నారాదాదాముని సప్తకంబులట
గరుదోరగ గంధర్వాక్షుండట - బంగారు రథమట
పైడి గుఱ్ఱాలట నిలువ రథముపై హంసపాన్పులట
రథము చుట్టు ముత్యల తోరణము హరియు ముందర
మధ్య సుభద్ర బలరాములతో ముగ్గురు మూర్తులట
రథమునాని వేంచేసియుందురట

చ౹౹ ఎంతో ఒకనాటి రోజునా - నారాయణ మూర్తీ
గుడిలోనుంచి వెళ్ళునట - వనవాసము ఒక మాసముందునట
దశదిశలెరుగక దాసులందరు - సేవ చేతురట నూరు ఒక్క భోగములచ్చట
గారెలు, బూరెలు, అప్పడంబులు, తేనెలు, ప్రెసెలు అరిశెలట
పులిహోరాలట, చక్రపోనులట పాలతో వండిన పరమాన్నమాట
గణ గణమని యెడి ఘంటనాథమాట హరికి
ఈవిధముగ అర్చనమట

చ౹౹ అక్కడ మందిరము చుట్టూ లెక్కలేని బైరాగి మాఠాలట
ఎక్కువమంది యోగీశ్వరులట మార్కేండేయుని దధి
గుండంబట శ్రీకృష్ణునకు వఠావృక్షమట ఒక్క మంటకే
ఉదుకు సాధమట సేకు సెయ్యదు అనే జాతులట
యేకముగా నచటారగింతురట

124