ఒనరిన మాధవ సంస్మరణంబె ఉద్యోగము మాకు
తిరుమంత్ర ద్వయ చరమార్థములె తెరదీయుట మాకు
గరిమతో రామానుజ చతురక్షరి కల్పతరువు మాకు
అరుదుగ నాళ్వారాదుల చరితము లాగమములు మాకు
అరయగ శ్రీ వైష్ణవద్యాసంబే అతిభోగ్యము మాకు
వారక నిరతము తిరుపతులె నివాసంబులు మాకు
ఆరూఢిగ రామానుజ మతమె ఆధారము మాకు
ఆరయ తిరుమల వెంకటార్యులే ఆచార్యులు మాకు
కోరిక పెదముక్తేవి లక్ష్మీపతి కులదైవము మాకు
చలమగు తిరుమణి శ్రీ చూర్ణంబె శృంగారము మాకు
పొలుపుగ తామర తులసీ పేరులె భూషణములు మాకు
అలసుదర్శన శంఖముద్రలే చిహ్నంబులు మాకు
తలుపులలో శరవైరుల దలచుట ధర్మంబది మాకు14
ఈ తిరునామం నిత్య వైష్ణవుల మత సంప్రదాయం గురించి తెలియజేస్తుంది. కలశం నిత్య వైష్ణవులకు తల్లి వంటిదనియు, జలజవాదుల జనకుడని, రోజు చేసే అష్టాక్షరి మంత్రము జపమూ చేయటం అని, రామానుజుని కథలే వేదాలని, భాగవతోత్తములే వారి ఆప్తమిత్రులని, మాధవుని యొక్క సంస్మరణమే వారికి ఉద్యోగంలాంటిదని వివరించారు. తిరు మంత్రము చరమార్థముల తెరదీయడం, గౌరవంతో రామానుజులు నేర్పించిన చతురాక్షరి మాకు కల్పతరువు వంటిదనియు అంటే అన్ని కోరికలను తీర్చేదనియు, ఆళ్వారాదుల చరితము, శాస్త్రములు శ్రీ వైష్ణవుని దాస్యం వారికి అతి భాగ్యము లాంటిదని ఈ తిరునామంలో పేర్కొన్నట్లుగా భావించాలి. శ్రీ వైష్ణవ రామానుజల మతమే తమకు ఆధారమని, అలాగే
వైష్ణవ దివ్యక్షేత్రమయిన తిరుపతిలో లక్ష్మీదేవితో కొలువైయున్న శ్రీనివాసుడే తమ కులదైవమని; శ్రీ వైష్ణవ తిరునామ చూర్ణమే తమకు శృంగార అలంకారమని; తామర, తులసీ దళములే వారికి ఆభరణాలనియు; సుదర్శన, శంఖ ముద్రలే వారికి చిహ్నములని; అదేవిధంగా వారికి వారి ఆలోచనలలో కూడా శరవైరులను తలంచుట వారికి ధర్మంబు అని ఈ తిరునామం మొత్తములో శ్రీ విష్ణుమూర్తిని గూర్చి ఇలా వివరించారు. ఈ విధంగా ఆధ్యాత్మికంగా వైకుంఠ ఏకాదశి రోజున
వైష్ణవ భక్తులందరూ తులసీమాల ధరించి పెరుమాండ్ల ఊరేగింపులో భగవంతుని పొగుడుతూ పాడుకొనే తిరునామం ఇది.
123