చ౹౹ కుటిలవాదులకు నిరంతరం సంపెటబెట్టు మీ తిరుమంత్రము
పఠన సేయుదు నాపాలి గురునిసేవ
ఘటన తప్పించితే శ్రీ శఠగోపుల యాన
చ౹౹ చరమార్థమగు గురుని శేషము
పరిపాలించితే విశేషమూ
సరగున నీవు నన్ను సరస రానివ్వకున్న
తిరుమంగయాళ్వారు గురుని పాదము యాన13
ఈ తిరునామంలో భక్తుడు తనని తాను అంటే విష్ణు భక్తుడైన తను పంచముడని చెప్పుకుంటాడు. నువ్వు కూడా నన్ను (ఇక్కడ నువ్వు అంటే విష్ణువు అని అర్థం) చూడడం లేదా? నీవు కులము, స్థలములు కాకుండా గుణములు చూడవలెను కదా! నన్ను చూడకపోతే వాళ్ళ అందరి మీద అన (అంటే ఒట్టు అని అర్థం). రామానుజులవారిని ఒక పంచముడైన విష్ణు భక్తుడు హెచ్చరిస్తున్నట్లుగా ఉంటుంది ఈ తిరునామం. ఓ గురువర్యా! పంచముడు, ప్రియభక్తుడను అయిన నేను స్వీకరించరాని అతిథిగా చేరితిని. కులము, స్థలము అనేవి చూడకుండా గుణమే ముఖ్యమైనదని భావించి పంచముడినైన నన్ను పలకరించుకున్నచో భాష్యకారుడైన ఆ రామానుజల మీద ఆన అని దయార్ద్ర హృదయముతో భక్తుడు భగవంతుడిని వేడుకొంటున్నాడు ఈ తిరునామంలో పంచ సంస్కారములతో ప్రజలను సేవించినవాడినే కదా! గురువు పంచన చేరిన వాడనే కదా! పంచకమలములోన ఒరిగిన వస్తువును కదా! నన్ను పంచన చేర్చుకోనున్న ఆ తిరుప్పాణ్యాళ్వారుల మీద ఒట్టు అని ఈ తిరునామములో పంచముడైన ఒక విష్ణు భక్తుడు వేడుకుంటున్నాడు. కుటిలవాదులకు నిరంతరం వాళ్ళు చేసే కుటిల ప్రయత్నాలకు సమ్మెట దెబ్బవలె వారికి తిరుమంత్రాన్ని బోధించకుండా ఉన్నవాడా! పంచముడైన విష్ణుభక్తుడిని నన్ము సంస్కరించకపోతే నా పాలిట గురువైన ఆ శఠగోపులమీద ఆన అని వేడుకుంటాడు. ఇంకా చరమార్థము అగు ఆ మంత్రార్థాన్ని వెంటనే నాకు ఉపదేశించి నా తప్పిదములు పరిహరించి నీ విలాసము (దరికి) రానివ్వకున్న ఆ తిరుమంగయాళ్వారు గురుని పాదము మీద అన అని ప్రార్థిస్తాడు.
తిరునామం-13
కలశాంభోనిది కన్యామణియే కన్నతల్లి మాకు
జలభవాదుల గన్నదైవమే జనకుండగు మాకు
దినదిన మష్టాక్షరి మంత్రంబె దివ్యజపము మాకు
వినుతింపగ రామానుజ కథలే వేదంబులు మాకు
పనుపడి శ్రీ భాగవతోత్తములే పరమాప్తులు మాకు
122