Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

||చ|| చ|| చెలిచేత వరముకై చీటి ఇవ్వగలేదా తిరిగి తిరిగి మంత్రమరచి గొనగ లేదా తిరుమంత్రము నాడందరికి తెలుపగ లేదా కొంగు చేడెను గూడి కొదువా దీర్చగ లేదా రంగూగ పాదక లింగోమన లేదా చ|| రాజసుతకు బ్రహ్మ రాక్షస విడలేదా తేజముగొని చెలి తెల్వినొందగ లేదా A శ్రీ భూతపురినీ వేంచేసి యుండగలేదా యీ భూతజాలము నేలెదమనలేదా చ|| భుజగాకృతిని వాని విజయాముగొన లేదా నిజకృపవిదల భూభుజుని నేలగ లేదా' 12 ఈ తిరునామంలో వైష్ణవ భక్తుడు నన్ను వదిలి వెళ్ళకు ఓ యతిరాజా! అని వేడుకొన్నట్లుగా ఉంటుంది. ఓ యతిరాజా, నాకోసమే కదా! నువ్వు అక్కడ హరి అంటే విష్ణువు యొక్క ఆజ్ఞ తీసుకొని భూమి మీదకి వచ్చావు. భక్తజనాలను ఉద్దరించడానికి కదా నీవు భూమి మీదకి వచ్చింది. నువ్వు మూగవానికి మోక్షం ఇచ్చావు. నాకెందుకు ఇవ్వవు? శాపగ్రస్తులు మీ శరణు వేడుకొనగా వారికి శాపముదీర్చి మీ దగ్గరికి తీసుకొనలేదా? ఇంకా ఈ తిరునామంలో రామానుజాచార్యులు 17 సార్లు తిరిగి తిరిగి 18వ సారి తిరుమంత్రాన్ని నేర్చుకున్నారు. ఆ తెలుసుకొన్న తిరుమంత్రాన్ని భక్తజనులకు తెలిపినారు. అటువంటి మీరు భక్తులు కొంగుచాచి అడిగిన కోరికలను నువ్వు తీర్చావు కదా! అలాగే గంగూ అనే బానిస భక్తునికి అభయం ఇవ్వలేదా! కాంచీపురంలో రాజు కుమార్తెకు బ్రహ్మరాక్షసి నుంచి విముక్తి కల్గించారు. ఆ రాజకుమారి రామానుజాచార్యుల వల్ల తెలివి తెచ్చుకొని ఆ బ్రహ్మరాక్షసి నుంచి విముక్తిని పొందింది. అంతేకాక, శేషావతారులై విజయము సాధించి, సత్యమైన మాయజూపి భక్తులను ఏలలేదా అని ఇన్ని ప్రశ్నలను సంధిస్తూ యతిరాజును అడిగినట్లు ఉంటుంది ఈ తిరునామం. తిరునామం 12 తలవాకిట నున్న దాసినీ నన్ను పిలవనంపరే పరదేశినీ కులమేల స్థలమేల గుణమె కారణమని పలుకకున్నను శ్రీ భాష్యకారులయాన పంచ సంస్కారిని గానటే నీ పంచగాంచి యుండలేనటే పంచకమలమందు బరిగిన వస్తువ పంచకున్నను శ్రీ తిరుప్పాణి యాళ్వారుల యాన 121