Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హితవుగ వైష్ణవ మతమే శ్రేష్టమని యతివై కాంతిమతికి జనించిన

చ౹౹ నాల్గువేదములను పరిశోధించి వేల్పులను సాధించి
నాల్గు నాల్గక్షరముల మంత్రార్థము నారాయణయని నరునకు దెలిపిన

చ౹౹ ఢిల్లీ సంస్థానమునకు వేంచేసి చెల్వపిల్లనుగాంచి
కాచగ భక్తుల నెల్లగూడుకొని మెల్లన యాదగిరిలో వెలసిన

చ౹౹ శేషావతారము మరల వహించి శేషాచల గాంచి
వాసిగ సుదర్శన పాంచజన్యమును శ్రీశుకునకు నతి శ్రీఘమే నొసగి

చ౹౹ ఆనూరి కేశవార్యతనయ దాసజన పోష
చేసితి భాగవత పచారంబును దోషములెన్నక దాసుని బ్రోవుని9

ఈ తిరునామంలో రామానుజాచార్యుల గారిని వేడుకొంటున్నట్లుంది ఈ తిరునామం. నాల్గు వేదాలను పరిశోధించి, నాల్గు నాల్గక్షారాలు అంటే ఎనిమిది అక్షరాల నారాయణ మంత్రాన్ని, దానిలోని మంత్రార్థము నీద్వారా తెలుసుకున్నాము ఓ యతిరాజా! అని అర్థం.

ఓ రామానుజాచార్య! నీవే ఈ మతాన్ని స్థాపించావు. అంటే ఈ వైష్ణవ మతాన్ని అందులోని సారాన్ని భక్తులకు తెలియ జేయటానికి తద్ద్వారా దీనిని ఉద్దరించడానికి పుట్టినవాడవు నీవేనయ్యా! ఈ విధంగా వైష్ణవ మంత్రాన్ని ఉపదేశించి మాలోని నీచత్వాన్ని, మేము చేసిన పాపాలను తొలగించటానికి వచ్చినవాడవు నీవేనని తెలియని బుద్ధిలేనివాడను. నీవే నాకు గతియని తెలుసుకోలేకపోయినవాడను. కాని, నీవే నాకు గతియని ఈ తిరునామంలో వివరించబడినదని అర్థం చేసుకోవాలి.

అంతేకాకుండా శేషావతరమును మరల ధరించుమయ్య, మమ్మల్ని కాపాడడానికి మళ్ళీ రావయ్య అని వేడుకొంటూ... అన్యమతములను పారద్రోలి, పతితోత్తారక బిరుదును చేపట్టి అన్ని మతములలో వైష్ణవ మతమే శ్రేష్ఠమని తెలియ చేసినవాడవు. ఢిల్లీ సంస్థానానికి వచ్చి, చెల్వపిల్లను చూసి భక్తులందరిని కలుపుకొని యాదగిరిలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహావతారునిగా వెలసిన వాడివి. మమ్మల్ని ఆదరించుమయ్యా అని ఈ తిరునామం అర్థం.

తిరునామం-9

చ౹౹ చక్కనిద్వయనిష్ట సంబంధపరులతో సరసమాడుటెన్నడో
ఎక్కువైన మిథున కైంకర్యపరులతో యేకమయ్యే దెన్నడో

చ౹౹ మూలమంత్రము దెలిసి ముక్తికాంతనుగూడి మురియుచుండేదెన్నడో
నాలుగక్షరముల కీలుదెలిసి వానిమూలము గనుటెన్నడో

చ౹౹ అష్టాక్షరియందు అమరిన ప్రణవము ఇష్టమయ్యేదెన్నడో
సృష్టిలో ఆచార్య శ్రీపాదతీర్థము స్వీకరించుటెన్నదో

118