వచ్చే దిగు దిగు దిగు
3. సొన్నారి మంత్రం :
ఈ మంత్రం దంతధావనానికి ముందు వేయాలి
ఊరికి ఉత్తరాన ఉరుముపుట్టె
ఉరుముకు వాన పుట్టె
వానకు వరద పుట్టె
వరదకు చెరువు పుట్టె
చెరువుకు జెల్లె పుట్టె
ముల్లు యిరిసి సన్నాసులు గోశాయీ
నీ మంత్రం పాటికి రాకపోనూ
నా మంత్రం పాటికి వచ్చును
సొన్నారి అయితే సొడి కట్టు
ఇదే మంత్రం కంచికకు అయితే చివరికి... ఈ విధంగా అనాలి
కంచికలు అయితే కడికట్టు
మైలకు అయితే మడికట్టు
ఐరాల అయితే అడికట్టు
4. ఐరా వైద్యం20
వాయింటాకును తెల్లపంచెలో కట్టాలి. అలా కట్టిన దానిని కన్నుకు కాపాలి. తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్లలో పసుపు వేయాలి. తర్వాత కొడవలి లేదా కొర్రాయి మంటలో పెట్టాలి. దీనిని గ్లాసులో పెట్టి ఆవిరి పట్టాలి.
5. కంచికకు, సొన్నారికకు, గడ్డలకు వైద్యం
ఉమ్మెత్త ఆకును నలిపి రసం తీయాలి.
దానిలో కొబ్బరి నూనె, హారతి కర్పూరం బిళ్ళలను కలపాలి.
దీనిని కోడి ఈకతో గడ్డలు అయిన దగ్గర అద్దాలి.
ఉమ్మెత్తకాకపోయిన, సన్నాయిలి కూర కూడా పెట్టవచ్చు.
ఈ వైద్యం సమయంలో నూనె పదార్థాలు వాడకూడదు.
ఈ వైద్యం సమయంలో తెల్లగొంగూర, ఎల్లిపాయ కారం ఉడకపెట్టిన టమాట పచ్చడి, చపాతీలను తినిపించాలి.
6. మహిళలకు తెల్లబట్ట అయితే వైద్యం
- పిండికూర వేళ్ళు, జీలకర్ర దంచాలి. దానిని తీసి నీళ్ళలో పోసుకొని తాగాలి.
- పిండికూరను, తోటకూరలో వేసి వండుకొని తినాలి.
- గణపత్రి ఆకు గింజలను ఎండపెట్టి దంచి, దానిని నీళ్ళలో పోసుకొని తాగాలి.
90