ఈ విధంగా అన్ని యంత్రాలు కలిపి ఒక కాగితం మీద సూక్ష్మంగా రాస్తారు. ప్రతి దానికి శూలం గుర్తుండేలా చూసుకుంటారు. ప్రతి అక్షరం తప్పు లేకుండా రాయాలి అని చెప్పారు. అక్షర దోషం ఉంటే ఆ యంత్రం పనికి రాదు అని చెప్పారు.
ఇంకా చిన్న పిల్లలకు కాని పెద్దలకు కాని ఈ లక్షణాలు కనిపిస్తే కొన్ని యంత్రాలు భయానికి, విరోచనాలకు, పుట్టిన బిడ్డలు బ్రతకకుండా చనిపోతే వారికి కట్టేవి.
అమ్మాయిలకు రసజ్వల కావటానికి కట్టే యంత్రాలు. పాలు లేని పశువులకు కట్టే యంత్రాలు, సంతానము కావడానికి, ఆరోగ్యానికి కట్టేవి, నిద్రలో పండ్లు కోరికే అలవాటు ఉన్నవారికి, కలువరింతకు, రాత్రిపూట జ్వరానికి, చలి జ్వరాలకు, పక్కలో మూత్రం పోసేవారికి, సోమిడికి, సుఖముగా ప్రసవించడానికి - రవియంత్రం, చంద్ర యంత్రం, కేతు యంత్రం, కుజ యంత్రం, బుధ యంత్రం, గురు యంత్రం, శుక్ర యంత్రం, రాహు యంత్రం లాంటి గ్రహపీడ యంత్రాలు కడతారు.16
ఈ విధంగా ప్రతి సమస్యకు మిత అయ్యల్వార్లలో యంత్రాలు కట్టే విధానం ఉంది. ఈ యంత్రాలు పనిచేయటానికి కొన్ని మంత్రాలను కూడా ఉపదేశించి ఆ యంత్రాలను కడతారు. వీటిని క్రింద పెట్టకుండా ధరించాలి. ఒకవేళ బస్సులోగాని, ట్రైన్లోగాని దూర ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడుగాని, నదులుకాని, చెరువులు కాని వచ్చినపుడు వాటిని పంటి కింద పెట్టుకోవాలి. ఆ నది పోయేంతవరకు అలాగే ఉంచుకోవాలి. ఆ నదికాని, చెరువుకాని దాటిపోయిన తర్వాత మరల ఆ యంత్రాన్ని మాములుగా పట్టుకొని తీసుకెళ్ళవచ్చు. ఈ విధంగా యంత్రాలు కట్టే సంస్కృతి మిత అయ్యల్వార్లలలో చూడవచ్చును. అదేవిధంగా వీరు వేసే కొన్ని మంత్రాలు, వైద్యం చేసే పద్ధతులను పేర్కొంటున్నాను.
15. అనారోగ్యాలను నివారించటం కోసం వాడే మంత్రాలు18
1. దిష్టి మంత్రం :
అగ్గాయిను బొగ్గాయిసు
అగ్గిదిని బొగ్గరిగె
బొగ్గుదిని అగ్గెరిగె
2. జదుపు మంత్రం :
శ్రీరామ నీవే కలవు
దాతో దాతో కేశవ దాత
కీటకరాల పంచమరాల చీపురు కట్టసింగారిస్తా
అంజలిపుత్రుడు హనుమంతుడు
89