Jump to content

పుట:మిత అయ్యల్ వార్లు.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వకాలంలో మిత అయ్యల్వార్లు ఏదైనా ఆపద కలిగిన లేదా ఏదైనా శారీరకమైన ఇబ్బంది కలిగినా యంత్రాలు కట్టేవారు. ఒక కాగితంపై 15 లేదా 17 యంత్రాలను రాసి దానిని దీర్ఘచతురస్రాకారంలో మడిచి, దాని చుట్టూ ఏదైనా కవర్ను కట్టి దానిని దారంతో చుట్టి, మగవాళ్ళకు మొలదారానికి, ఆడవాళ్లకు పుస్తెలు తాడుకు కడతారు. దీనివల్ల వారి బాధ నయం అవుతుందని కట్టించుకొనే వారి నమ్మకం. నా క్షేత్ర పర్యటనలో ఘనపూర్ వాస్తవ్యులైన పిట్టల లక్ష్మీ నర్సయ్య గారిని కల్సినపుడు వారి వద్ద ఈ యంత్రాలకు సంబంధించిన తాటాకు పత్రాలు (తాళపత్ర గ్రంథాలు) ఉన్నాయి. వీరికి వారి తాతల వద్ద నుండి వారసత్వంగా వస్తున్నాయని పిట్టల లక్ష్మీనర్సయ్యగారు చెప్పారు. పూర్వకాలం లో వైద్యం అందుబాటులో లేని సమయంలో ఈ యంత్రాలు వాడేవారని చెప్పారు. ఈ యంత్రాలు అవతలివారి బాధకు తగ్గట్టుగా చేసి సంఖ్యలో రాసి ఇస్తారు.17 ఈ సందర్భంగా అటువంటి కొన్ని యంత్రాలను ఇక్కడ వివరిస్తున్నాను.

ఆంజనేయ యంత్రం

ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు, విజయం సాధించడానికి, ఎటువంటి అశుభాలు జరుగకుండా ఈ యంత్రం రాస్తారు. ఆంజనేయుని యంత్రం సర్వకార్యాలకు పనికి వస్తుందని విశ్వసిస్తారు.

ఈ ఆంజనేయ యంత్రాన్ని రాసి ఇంకా ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దీనికి తోడుగా చిన్న బేసి సంఖ్యలో వచ్చేటట్లు యంత్రాలు రాస్తారు.

82