పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24, 233. మారిషస్‌లో తెలుగువారి కధనం ప్రకారం చాలా మంది తెలుగువారు ఇతర భాషలు మాట్లాడే వారిగా పొరబాటున నమోదు చేయించుకున్నందువలన తెలుగువారి సంఖ్య తక్కువగా ఉందని, భాషాపరంగా కాక తెలుగు జాతీయతప్రకారం లెక్కలు జరిపితే తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

70 మందిగల మారిషస్ పార్లమెంటులో తెలుగువారు నలుగురు ఉన్నారు. వారు (1) మహేన్ ఉచ్చన్న (ఇంధన జల వనరుల మంత్రి) (2) శ్రీ విష్ణు లక్ష్మీనాయుడు (వీరు గతంలో ఉప ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రధాని అనిరుద్ జగన్నాధ్‌తో విభేదాల కారణంగా వైదొలిగారు) (3) శ్రీ రాజవీరాస్వామి గారు (వీరు గతంలో మారిషస్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా పని చేశారు.) (4) శ్రీ శ్రీకృష్ణ బాలిగాడు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలుగువారి సంఖ్య పెరగగలదనే ఆశాభావంతో ఉన్నారు మారిషన్ ఆంధ్రులు.

మారిషస్ ప్రభుత్వ శాఖల్లో తెలుగు వారు ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. రామగులాం మెడికల్ రిసెర్చి సెంటర్‌ల్లో పని చేస్తున్న కార్డియాలజిస్టు, ప్రొఫెసర్ బాలిగారు. గుండె జబ్బులకు కనిపెట్టిన మందులు ప్రపంచ వ్యాప్తి చెందినవని చెప్పారు.

మారిషస్ ప్రభుత్వంలో బడ్జెట్ ఆఫీసరుగా పనిచేస్తున్న శ్రీ రామనాయ్డు సోకప్పడు (విష్ణు) ముల్కీ నిబంధన వలన హైద్రాబాద్‌లో మారిషస్ విద్యార్థులకు సీట్లు రాకపోవటం వలన ఢిల్లీ, బొంబాయి, బెంగుళూరు వెళ్ళి చదువుకోవలసి వస్తోందని, మరికొంతమంది ఫ్రాన్స్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వెళ్ళి చదువుకుంటున్నారని, మాతృ రాష్ట్రంలో చదవాలనే తపన తీరటం లేదని అన్నారు.

మ్యూజియం అధిపతిగా శ్రీ రాజన్న గజని, అటవీశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీ పోపయ్య పదవుల్లో ఉన్నారు. హెడ్ ఆఫ్ ఫ్రిజన్‌గా శ్రీ లక్ష్మయ్య, టెలికమ్యూనికేషన్ డైరెక్టర్‌గా శ్రీ పిండయ్య గతంలో పనిచేసి రిటైరయ్యారు.

ఆర్థికస్థితిలో హిందీవారి కంటే తెలుగువారే అధికులుగా ఉన్నారు. నేషనల్ తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ ఎస్.ఎ. రాఘవుడు తెలుగువారిలో సంపన్నుడు. వందల సంఖ్యలో అద్దెకార్లు ఆయనకి ఉన్నాయట.

మారిషస్ టెలివిజన్‌లో నెల నెలా రెండు తెలుగు చలన చిత్రాలు ప్రసారం చేస్తారు. ప్రతి శనివారం తెలుగు సీరియల్ ప్రసారం చేస్తారు. మేము ఒక రోజు 'ఆనందో బ్రహ్మా' ప్రసారం అవుతూండగా చూశాము. మారిషస్ రేడియోలో మొదటి