పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

జుట్టుతో నీగ్రోల్లా ఉన్న వ్యక్తులు ఎదురు వస్తున్నారు. వారివాలకాలను గమనించిన శ్రీ త్యాగరాజ్ దొంగల్లా ఉన్నారని వారిని పరిశీలిస్తూ రాసాగారు. అక్కడ షాపింగ్ చేసి వస్తున్న ఒక అమ్మాయి నుంచి పర్సును కాజేయటానికి ప్రయత్నించారు. శ్రీ త్యాగరాజ్ క్రియోల్ భాషలో ఏదో అన్నాడు. వారు వెంటనే క్రియోల్లో పెద్దగా అరుస్తూ కోపంగా శ్రీ త్యాగరాజ్ మీదకు రాసాగారు. వారి వద్ద చిన్న చిన్న కత్తులుకూడా ఉన్నాయి. ఈ లోపుగా జనం పోగయ్యేసరికి వాళ్ళు తిట్టుకుంటూ పోయారు. మారిషస్‌లో ఇదొక అనుభవం.

పోర్టులూయిస్ నుంచి క్వార్టర్ బార్నలోని గోల్డ్ క్రిస్ట్ హోటల్‌కుఎనిమిది మైళ్లు బస్సులో ప్రయాణించాము. బస్సు స్టాపులో జనం ఎవరంతటవారు వెళ్ళి క్యూలో నిలబడతారు. త్రోసుకుని ఎక్కే ప్రయత్నం చేయరు. క్యూలో ఉన్నవారు వరుసగా వెళ్ళి బసు ఎక్కుతారు. బస్సు నిండగానే కదలిపోతుంది. మిగిలినవారు వెనుక వచ్చే మరో బస్సు కోసం వేచి నిలబడతారుగాని మనదేశంలో మాదిరిగా త్రోసుకుని ఎక్కి కిక్కిరిసి నిలబడి ప్రయాణం చేయరు. వారిక్రమశిక్షణ అద్భుతం.

సంప్రదాయ పరిరక్షకులు తెలుగు మహిళలు

ఏ దేశపు సంస్కృతి అయినా, ఏ జాతి ఆచార వ్యవహారాలైనా స్త్రీల వలన నిలబడతాయి అని మారిషస్ ఆంధ్ర ఆడబడుచులు రుజువు చేశారు. 150 సంవత్సరాల క్రితం మన దేశం నుంచి తరలి వెళ్ళినప్పటికీ తెలుగువారి కట్టూబొట్టూ ఆచార వ్యవహారాలు మారిషస్‌లో నిలబడ్డాయంటే ఆ ఘనతంతా ఆంధ్రవనితలకే చెందుతుంది.

మారిషస్‌లో తెలుగువారి ఇళ్ళకు వెడితే వాకిళ్ళలో ముగ్గులూ, గుమ్మాలకు పూసిన పసుపు కుంకుమలూ కనిపిస్తాయి. తెలుగు మహిళ మన సంప్రదాయాలనూ సంస్కృతిని విస్మరించలేదనటానికి ఇంతకంటే నిదర్శనం మరేమీ లేదు. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంగాని, ఆధునిక ధోరణులు కాని మన ఆంధ్ర స్త్రీల జోలికి రాకపోవటం విశేషం.

జీన్సూ గౌనులు మన వారిని ఆకర్షించలేకపోయాయి తెలుగుతనం వుట్టిపడ్తూ నుదుటని మెరిసే కుంకుమతో కుడి పమిట వేసుకుని మారిషస్ ఆంధ్ర వనితలు దర్శనమిస్తారు. ఆడ పిల్లలకు పరికిణీ, ఓణి, మగపిల్లలకు పంచకట్టు కట్టి వారు మురిసి పోతూంటూరు, తెలుగు మహాసభల ర్యాలీకి ఆడపిల్లలు రంగు రంగుల పరికిణీలూ, ఓణీలూ ధరించి వచ్చారు.