పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదినేషన్:ఆర్క్-ఎన్-సియల్

ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ పూసరాజ్ సూరయ్య వందన సమర్పణలో మహాసభ ముగింపు కార్యక్రమం ముగిసిన పిమ్మట మారిషస్ విద్యా సాంస్కృతికశాఖ వారు నేషన్ ఆర్క్-ఎన్-సియల్ పేరిట బహుభాషా సంస్కృతుల మేలికలయక అయిన కమనీయ సాంస్కృతిక ప్రదర్శనలు యిచ్చారు. శ్రీ రాజన్ అప్పడు తెలుగు భక్తి గీతాలతో ప్రారంభం అయిన ఈ కార్యక్రమంలో లాల్ మహ్మద్ బృందంవారి కవ్వాలి, గ్వాన్ మెహిత పాటల బృందంవారి భోజపూరి పాటలు వినిపించారు.

తెలుగు జానపద నృత్యం, తమిళ కోలాటం, చైనీస్ జానపద నృత్యం, టిప్నిడ్యాన్స్ ప్రేక్షకుల్ని పరవశింపచేశాయి. మంత్రి శ్రీ పరుశురామ్ అభివర్ణించినట్లు మారిషస్ భిన్న సంస్కృతుల అందాల హరివిల్లు ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని శ్రీ చిన్నయ స్వామి సమర్పించారు.

మారిషస్‌లో షాపింగ్

తీరిక చిక్కని మహాసభల కార్యక్రమాల నుంచి కాస్తంత తీరిక చేసుకుని పోర్టు లూయిస్‌లో నేనూ, శ్రీ ఆచంట, శ్రీత్యాగరాజుతో షాపింగ్ చేయడానికి వెళ్ళాము. మారిషన్ లో దొరకని వస్తువంటూ ఉండదు. అన్ని దేశాల వస్తువులు అక్కడ మనకు లభిస్తాయి. అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు మాత్రం మనదేశంలో కంటే ఎక్కువధరగా అనిపించాయి. బట్టలు చాలా చవక.

పోర్టులూయిస్‌లో శ్రీ గారయ్యగారనే ఆంధ్రవర్తకుడు పెద్ద బట్టల కొట్టు పెట్టారు. త్యాగరాజ్ మమ్మల్ని వారి దుకాణానికి తీసుకుని వెళ్ళారు. శ్రీ ఆచంట, నేనూ మా కుటుంబసభ్యులకు, పిల్లలకూ చీరలూ బట్టలూ తీసుకున్నాం. శ్రీ గారాయ్యగారి అబ్బాయి ఆంధ్రాలోనే వైద్యవిద్యనభ్యసించి హైద్రాబాద్ అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు ఎంతో ఆనందంగా శ్రీ గారయ్య దంపతులు మాకు చెప్పారు. ఒక చైనీస్ దుకాణంలో లవంగాలూ, దాల్చినచెక్కా చవకగా వుంటే కొన్నాం. బంధుమిత్రులకు బహుమతిగా తీసుకురావటానికి చిన్న చిన్న మారిషస్ జ్ఞాపికలు కొన్నాం.

మారిషస్‌లో దొంగల బెడద ఎక్కువగానే వుంది. శ్రీ త్యాగరాజ్ దారి పొడుగునా మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. పోర్టులూయిస్‌లో మంచి రద్దీగా ఉన్న రోడ్డులో వెళ్తున్నాము. మా కెదురుగా ఇద్దరు నల్లగా, పొడుగ్గా , చింపిరి