పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీలుగా పధకాలను రూపొందించి, అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖను కోరడానికి తీర్మానించడమయినది.

3. భారతదేశంలోనూ, విదేశాలలోనూ తెలుగు అధ్యయనాన్ని ప్రోత్సాహించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి తీర్మానించడమయినది.
4. విదేశాలలోని తెలుగు వారి కోరిక మేరకు ఆయా దేశాలకు సాంస్కృతిక బృందాలను పంపించడానికి తీర్మానించడమయినది.
5. శిక్షణా పధకాల ద్వారానూ, బోధనా సామాగ్రిని మెరుగుపరచడం ద్వారానూ, ప్రణాళికా బద్దమైన బోధనా పద్దతుల నవలంబించటం ద్వారానూ, తెలుగు భాషాధ్యయనాన్ని ప్రోత్సాహించడానికి మారిషస్ లోని మోకా వద్ద మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌కూ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు విశ్వ విద్యాలయముకూసంధానం ఏర్పాటు చేయడానికి తీర్మానించటం అయినది.
6. తెలుగు భాషాధ్యయనా ఆసక్తి చూపే తెలుగువారి కొరకు కరస్పాండెన్స్ కోర్సులు పునరుద్ధరించడానికిగాను ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని అభ్యర్ధించడానికి తీర్మానించడమయినది.
7. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషాభివృద్ధి కృషి నిమిత్తం ప్రపంచంలోని తెలుగువారి నుండి భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుండి పొందిన మూల ధనంతో, ప్రపంచ తెలుగునిధిని'ని ఏర్పాటు చేయాలని తీర్మానించడమయినది.
8. కనీసం ప్రతి అయిదు సంవత్సరాలకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సన్నిహిత సహకారాలతో ప్రపంచ తెలుగు మహానభలను నిర్వహించాలని తీర్మానించడమయినది.
9. తెలుగు విశ్వ విద్యాలయములోని అంతర్జాతీయ తెలుగు కేంద్రం సన్నిహిత సహకారాలతో తెలుగు సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు పెంపొందించడానికి తెలుగు అసోసియేషన్స్ సెడరేషన్ ఏర్పాటు చేయడానికి తీర్మానించడమయినది.
10. భాష, సంస్కృతి మరియు కళల కోర్సులలో విద్యనభ్యసించడానికి అభిలాషకల విదేశాంధ్ర విద్యార్థులకు ఉన్నత విద్యాలయాలలోనూ, విశ్వ విద్యాలయాలలోనూ స్కాలర్ షిప్‌లు ఏర్పాటుచేయడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించడానికి తీర్మానించడమయినది.