పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యాలయం చేపట్టే కార్యక్రమాలకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందివ్వగలదని హామీ ఇచ్చారు. సదస్సులో సమర్పించిన పత్రాలను మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ గ్రంధరూపంలో వెలువరుస్తుందని శ్రీ పరశురామ్ వెల్లడించారు.

మహాసభలో పాల్గొన్న విదేశీ ప్రతినిధులకు శ్రీ పరశురామ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకించి ప్రపంచ తెలుగు మహాసభల భావనకు మూలపురుషుడైన శ్రీ మండలి వెంకట కృష్ణారావు ఆయురారోగ్యాలతో విలసిల్లి మున్ముందు అనేక కాన్పరెన్సుల్లో పాల్గొనాలనే ఆకాంక్ష శ్రీ పరశురామ్ వెలిబుచ్చారు. శ్రీ పరశురామ్ తమ ప్రసంగం చివర తెలుగులో -

'మహాసభలకు వచ్చినందుకు కృతజ్ఞతలు
మారిషస్ దేశానికీ జయం
తెలుగు భాషకి జయం
భారతదేశానికీ జయం'

అంటూ ప్రతినిధుల కరతాళధ్వనుల మధ్య స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని ముగించారు. మారిషస్ ఇంధన, జలవనరులమంత్రి శ్రీ మహేన్ ఉచ్చన్న పట్టలేని ఆనందంతో మహాసభలు గొప్పగా జరిగాయని, తమపూర్వీకుల బాటలో సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకు శాయశక్తుల కృషిచేస్తామని చెప్పారు.

దక్షిణాఫ్రికా ప్రతినిధివర్గంనాయకుడు శ్రీ టి.పి.నాయ్డు, మలేషియా ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ పాల్‌నాయ్డు, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధివర్గం పక్షాన శ్రీ గోవిందరాజు రామకృష్ణారావు మారిషస్ ప్రభుత్వానికి, మారిషస్ ఆంధ్ర మహాసభకు కృతజ్ఞతాంజలి పట్టారు.

విదేశీ ప్రముఖులకు మంత్రి శ్రీ ఉచ్చన్న మెమెంటోలు బహూకరించి సత్కరించారు.

మహాసభల సందర్భంగా నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీలలో విజేతలైన విధ్యార్ధులకు శ్రీ మండలి వెంకట కృష్ణారావు బహుమతీ ప్రదానం చేశారు.

తీర్మానాలు
1. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వెలుపల మరియు విదేశాలలో ఉన్న తెలుగు విద్యార్ధులకు ఇంజినీరింగ్, మెడిసన్ కోర్సులలో సీట్లు పునరుద్ధరించవలసినదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడానికి తీర్మానించడమయినది.
2. ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలను విదేశాలలోని తెలుగువారు సందర్శించటానికి