పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభుత్వం నుండి ఎవరైనా మంత్రి వచ్చి ఉంటే బాగుండేది. ఈ విషయంలో మారిషస్ ఆంధ్రులు ఎంతగానో బాధపడ్డారు.

డా॥ సి.నారాయణరెడ్డి ప్రభృతులు లోటును కప్పిపుచ్చి కొంతమేరకు సఫలీకృతులైనప్పటికీ తీర్మానాలు అమలు పరచవల్సింది రాష్ట్ర ప్రభుత్వం - దానికి డా॥ సి.నారాయణరెడ్డి ఎంతవరకు బాధ్యత వహించి హామీ ఇవ్వగలరు. ప్రతినిధి వర్గనాయకుడిగా మహాసభల నివేదికను, తీర్మానాలను ప్రభుత్వానికి అందించగలరు కాని అమలుపరిచే విషయంలో ప్రభుత్వాన్ని శాసించలేరు కదా! ఇవి లోలోన అందరికీ శేష ప్రశ్నలు. అన్నిటికంటే మరో ముఖ్యమైన లోటు. ఏ మహాసభలకైనా సదస్సులు, అందులో చర్చించే విషయాలు ప్రాణం వంటివి. మారిషస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిద్యం పలచనకావటం చాలా విచారకరం. డా.సి.నారాయణరెడ్డి, శివరామమూర్తి మారిషస్‌కి వేరే కార్యక్రమాల మీద వచ్చిన ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు మినహాయిస్తే మన రాష్ట్రం నుండి సరైన ప్రాతినిద్యం లేదు.

కనీసం నలుగురైదుగురు తెలుగు పరిశోధకులను, ఆచార్యులను, పండితులను ప్రభుత్వం పంపించి ఉంటే బావుండేది.

దక్షిణాఫ్రికా, మలేషియా ఆంధ్ర సంఘంవారు తమ తమ దేశాల్లోని ప్రొఫెసర్లను, పెద్దలను తీసుకువచ్చి ఆయా దేశాల్లోని తెలుగు భాషా సమస్యలపై చక్కటి ప్రసంగం వ్యాసాలు సమర్పించారు.నిజానికి మహాసభలకు జీవం పోసిన వారు వారే. మారిషస్ ఆంధ్రులు తమ వ్యాసాలను తెలుగులోనే సమర్పించటం విశేషం.

ముగింపుసభ

13 వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెలుగు మహాసభల ముగింపు సమావేశం జరిగింది.

మారిషస్ విద్యామంత్రి శ్రీ ఆర్ముగం పరశురామన్ స్నాతకోపన్యాసం చేస్తూ 'మారిషస్ తెలుగు మహాసభలు' విజయవంతంగా జరిగినందుకు ఆనందం వ్యక్తం చేశారు. చిన్న దేశంలో స్వల్ప సంఖ్యలో ఉన్న ఆంధ్రులు సభలను దిగ్విజయంగా నిర్వహించటం అభినందనీయమైన విషయం అని అన్నారు.

జనవరి 1991 నుంచి తెలుగు ఉపాధ్యాయులకు అలవెన్స్ 100 రూ.ల నుంచి 300 రూ.ల వరకూ పెంచటం జరుగుతుందని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వీడియో కేసెట్ల ద్వారా తెలుగు విధ్యాబోధన జరపాలని శ్రీ పరశురాం సూచించారు. మారిషస్‌లో తెలుగు భాషా వ్యాప్తికి తెలుగు విశ్వ