పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాఠ్యపుస్తకాలు తయారు చేస్తూ, కోరిన విద్యార్ధుల కోసం Diploma Course నడుపుతూంటే మాకు ఎంతో లాభం కలుగుతుందని నా నమ్మకం. M.G.I వారు ఇప్పుడే G.C.E. Advance Course ఏర్పాటు చేశారు మరి ఈ 1990 సం.న మొట్ట మొదటి సారిగా విద్యార్ధులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. International Telugu Institute వాళ్ళు 1977 లో 5 గురు మారిషస్ విద్యార్ధుల కోసం కోర్సు ఏర్పాటు చేశారు. దాని తర్వాత 13 సం॥ లు దాటింది, ఏ కోర్సు జరగలేదు. దీని బదులుగ ఆ మాదిరి కోర్సుమా మారిషన్ దేశంలోనే ఏర్పాటు చేస్తే 5 గురి బదులుగా 30 - 40 మందికి లాభం కలగవచ్చు. ఆఖరిలో మా పూర్వీకులు ఈ దేశానికి వచ్చి 150 సం.లు అయినది. 150 సం.లు అంటే 150 రోజులు కావు. ఎంతో కష్టంతో మన తెలుగు భాష ఈ ఆధునిక పరిస్థితిలో ఉంది. నేను చెప్పిన దాంట్లో బహుశః చాలా తప్పులు ఉండవచ్చు, భాష తేడా ఉండవచ్చు మీరు పెద్దలు దీని గురించి నన్ను క్షమించండి. దీంట్లో ముఖ్యమైనది ఏమిటంటే మా ఉద్దేశ్యము గ్రహించండి. దీనితో పాటు నేను సెలవు తీసుకుంటున్నాను.

జైమారిషన్ దేశం! జై భారతదేశం!! జై ఆంధ్ర ప్రదేశం!!

జై మన తెలుగు తల్లికి!!!

ప్రతినిధుల సమావేశం

డా.సి.నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రతినిధుల సమావేశం జరిగింది. ప్రతినిధులు ఉత్సాహంగా వాడిగా వేడిగా భాషాభివృద్ధిపై చర్చించారు. అంతర్జాతీయ తెలుగు సంస్థను రద్దు చేయటం పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తెలుగు బోధనకు తగిన సహకారం లభించక పోవటం పట్ల ప్రతినిధులు ఆవేదనను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాతృభాషాసంస్కృతుల పట్ల వారికి గల ప్రగాడాభిమానం వారి ప్రసంగాల్లో వ్యక్తం అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాని, ఆయన పక్షాన మంత్రులుగాని ఎవరైనా వచ్చి వుంటే సభలు ఇంకా శోభాయమానంగా ఉండటమే కాకుండా, విదేశాంద్రుల సమస్యల పరిష్కారానికి కొంతమేర దోహదపడటానికి ఉపయోగపడేది. విధాన నిర్ణయాలు తీసుకోవల్సినవారు వారే కదా!

అదీకాక మారిషస్ గవర్నర్ జనరల్ ప్రధానమంత్రి సరసన మన మంత్రులు లేనిలోటు కొట్టొచ్చినట్లు కన్పించింది. కనీసం ప్రోటోకాల్ కోసమైనా రాష్ట్ర