పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దీనితో మాకు కొంచెం ప్రోత్సాహం కలిగినట్టు అయింది. ఆ సమయంలో మన తెలుగు పుస్తకాలే మా ప్రచారకులు, మా ఆధారం. అది లేకపోతే మన తెలుగు తల్లి వ్యాధిగా అయిపోతుందని అనాలి.

1958 సంవత్సరమున ఆగష్టు నెల మా మారిషస్ ప్రభుత్వం వారు నలుగురు ఉపాధ్యాయుల్ని ఎన్నుకొన్నారు. వీళ్ళకి 1 september 58 ఇప్పించి, 1958 నుంచి ప్రాధమిక బడుల్లో తెలుగు భాషా బోధన మొదలుపెట్టారు. అప్పటి నుంచి మన తెలుగు భాషా సంస్కృతి గురించి ఒక కొత్త పుట్టుక అయిందని చెప్పాలి. మా మారిషస్ ప్రభుత్వం వారు ఈ భాష మొదలుపెట్టకుంటే అప్పుడే ఇది పోయి యుండేది. దీనిగురించి మా మారిషస్ ప్రభుత్వం వారికి మా కృతజ్ఞతలు తెలుపడమే మా కర్తవ్యం. ఈ మన తెలుగు భాష బోధన గురించి నియుక్తి గావింపబడిన పేర్లు ఇవి: Mr.Sri.Lingah Ramasamy, Erabadhoo Elliah, Mr.Sri.Encarsamy Veerasamy,Mr.Sri Somanah Somiah, ఈ నలుగురూ ప్రాధమిక పాఠశాలల్లో తెలుగు భాషా బోధనకు ఆది గురువులు.

ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాషా బోధన మొదలైనది గానీ, పాఠ్యప్రణాళిక లేదు. చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మేలు అన్నట్టు, అప్పుడు Mr.Sri Sanassee Gooriah తెలుగుభాష Supervisor గా ఉన్నారు. ఈతని కోరిక ప్రకారంగా శ్రీ సోమయ్యగారు మొట్ట మొదట తనకున్న తెలివితో పాఠ్యప్రణాళిక తయారు చేశారు. మా మారిషస్ ప్రభుత్వం ఆశీర్వాదం వల్ల ప్రాధమిక పాఠశాలలో తెలుగు భాషా బోధన మొదలయినది, దీనితో బాటు మన తెలుగులకీ చాలా ప్రోత్సాహం కలిగింది. రొట్టె కొరకో, భాషా సంస్కృతి ప్రవృధి కొరకో, విద్యార్దులు తెలుగు భాష నేర్చుకోడానికి మరల మొదలుపెట్టారు. అదే సందర్భాన శ్రీ గున్నయ్య గురువుగారు డిశంబరు 1960 సం.న మా మారిషస్ దేశానికి మరలి వచ్చారు కదూ, ఈయన రాకతో మన తెలుగు వాళ్ళలో ఒక రకంగా మెలకువ వచ్చింది. శ్రీ గున్నయ్య గురువు ఆదేశ ప్రకారంగా మొట్ట మొదటి సారి ఉగాది పండగ Riviere du Rempart గ్రామంలో ఎంతో వేడుకతో జరిగింది. తర్వాత ఆంధ్ర అవతరణ ఉత్సవం జరిగింది. మన తెలుగు వారికి కూడా పండగలు, ఉత్సవాలు ఉన్నాయని తెలిసి మాకు ఎంతో గౌరవం కలిగింది. ప్రాణం కోల్పోవుతున్న వారి ఒంట్లో ప్రాణం పోసి నట్లయ్యింది. అప్పటి నుంచి అంటే 1962 నుంచి ప్రతి సంవత్సరం ఉగాది పండగ, ఆంధ్ర అవతరణ ఉత్సవం జరుపుకొంటాం. ఇవే మాకు సంపద. భారత ప్రభుత్వం