పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 1989 సంవత్సరపు లెక్కల ననుసరించి మారిషస్‌లో ప్రస్తుతం తెలుగుభాష పరిస్థితి

1. MAMS శాఖలలో తెలుగుభాషను బోధించే బళ్ళు - 40
2. తెలుగును బోధించే ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలు - 100
3. తెలుగును బోధించే కళాశాలలు - 2
4. ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల తెలుగు ఉపాధ్యాయుల సంఖ్య - 125
5. ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో తెలుగుభాషను చదివే పిల్లలు - 4000

మారిషస్‌లో తెలుగుభాషా వికాసం గురించి శ్రీరెడ్డి లక్ష్ముడుగారి ప్రసంగం ఎంతో వివరణాత్మకంగా ఉండి మారిషస్ ఆంధ్రులు తమ భాషా సంస్కృతులను పరిరక్షించుకొనుటకు చేసిన కృషిని విశదపరిచింది.

ఇంకా ఆనాటి సదస్సులో తరతరాల తెలుగుజాతిని గురించి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శ్రీ చల్లా రామఫణి, శ్రీ చంద్రశేఖరభట్టు జీవితవిశేషాలను గురించి డాక్టర్ సంగంభట్ల నరసయ్య ప్రసంగించారు.

ఆరోజు మధ్యాహ్నం జరిగిన కళాసంస్కృతి సదస్సుకు తెలుగువిశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డా॥ ఎన్. శివరామమూర్తి అధ్యక్షత వహించారు. ఆంధ్రీకరణపై డా టి.పి.నాయుడు(దక్షిణాఫ్రికా),మారిషస్‌లో మహిళల స్థానంపై శ్రీమతి ఎ.ఎన్. ఆనందన్ (మారిషస్), మారిషస్‌లో తెలుగు పండుగలు ఆచార వ్యవహారాలపై శ్రీ ఎస్.అప్పయ్య (మారిషస్), ఆంధ్ర మహాభారతంపై ప్రొఫెసర్‌గిరిప్రకాష్ (మధురై యూనివర్శిటీ) ప్రసంగించారు.

సదస్సులు ముగిసిన పిమ్మట మా నాన్నగారు, నేను, శ్రీ గోవాడ సత్యారావు, శ్రీ త్యాగరాజ్‌తో కలసి తదుపరి కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం కారులో బయలుదేరాం, ముందుగా పోర్టులూయిస్‌లోని మార్షియన్ పత్రికా కార్యాలయానికి వెళ్ళాం. శ్రీ సత్యారావు లోపలికి వెళ్ళి ఆనాటి సదస్సు వార్తా విశేషాల్ని వారికి అందచేసి వచ్చారు.

శ్రీ సత్యారావు ఉద్యోగరీత్యా చాలాకాలం ఢిల్లీలో ఉండటంవలన ప్రవాసాంధ్రుల సమస్యలపట్ల చాలా అనుభవం గడించారు. వారి సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కావటంచేత మారిషస్ యువకుడు శ్రీ త్యాగరాజ్‌తో కారులో మారిషస్ ఆంధ్రుల సమస్యల్ని గురించి చర్చించసాగారు, మారిషస్ ఆంధ్రులలో రెండు వర్గాలు ఉన్నట్లు వారి చర్చల వలన బోధపడింది. శ్రీ త్యాగరాజ్ మారిషస్ తెలుగు