పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 ఆంధ్రులు వారి సంస్కృతిని కాపాడుకుంటూనే దక్షిణాఫ్రికా సమాజంలో అంతర్భాగం అయిపోయారు.

గవర్నర్ జనరల్ గార్డెన్ పార్టీ

మారిషస్ గవర్నర్ జనరల్ సర్‌వీరాస్వామి రింగడు సాయంత్రం 5 గంటలకు తన అధికార నివాసమైన లిరిడూట్ (ఆశ్రయము) లో గార్డెన్ పార్టీ ఇచ్చారు. విశాలమైన పచ్చిక బయళ్ళతో, పూదోటలతో, జలాశయాలతో, పక్షుల కేంద్రాలతో నిండిన ఆ రాజప్రసాదం ప్రకృతి రమణీయతకు దర్పణ.

ఫ్రెంచ్ గవర్నర్ ప్రాంకోస్ మహెడిలాబొర్డ్‌నాస్ 1748 లో బ్రిటిష్ వారి దాడులనుండి మహిళలను, పసిపిల్లలను రక్షించడానికి లిరిడూట్ (ఆశ్రయము) నీర్మించాడట. దీని చుట్టూ కందకం, దానిపైన పైకిలాగే వంతెన ఉండేవట. డేవిర్ తరువాత వచ్చిన బౌల్‌డితోజర్ భవనము చుట్టూ పూతోటలను, వనాలను పెంచాడు. పూసిఅబ్ల్ అనే వృక్ష శాస్త్రజ్ఞుడు ప్రపంచంలోనీ అన్ని ప్రాంతాల నుండి మొక్కలను చెట్లను తెప్పించి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశాడు. ఫ్రెంచి పరిపాలనాదక్షునిగా పేరొందిన పియరి పావరి ఈ ఉద్యానవనాన్ని ప్రపంచంలో కెల్లా అతి సుందర నందన వనాలలో ఒకటిగా తీర్చిదిద్దాడు.

1778 లో ఈ భవనాన్ని పునర్నిర్మించారు. గవర్నర్ జనరల్‌గా నియమితుడైన కౌంటాడి సౌలాన్ ఈ భవనాన్ని తన అధికార నివాసంగా మార్చాడు. ఆ విధంగా "లిరిడూట్ గవర్నర్ జనరల్ నివాసభవనం అయ్యింది. ఆ తరువాత వచ్చిన బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ కూడా దీనిలో నివాసముండి దాని అభివృద్దికి తోడ్పడ్డారు.

1968 మార్చి 12 న మారిషస్ స్వాతంత్ర్యం పొందింది. సర్‌జాన్ పావరి చివరి బ్రిటిష్ గవర్నర్ స్వతంత్ర మారిషస్ మొదటి గవర్నర్. జనరల్ సర్ అబ్దుల్ రహమెన్ మహ్మద్ ఉస్మాన్. ఆయన అంతకు పూర్వం మారిషస్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సాహిత్యాభిలాషగల గొప్ప సంస్కారిగా పేరొందారు.

మారిషస్ సివిల్ సర్వీసుల అధిపతిగా పని చేసిన సర్ దేవేంద్రనాథ్ చోయిన్‌చె 1978 మార్చిలో ద్వితీయ గవర్నర్ జనరల్ అయ్యారు.

1983 లో మారిషస్ జాతిపితగా పూజించబడే సర్ శివసాగర్ రామ్ గులామ్ గవర్నర్‌జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్రోద్యమంలో ప్రముఖపాత్ర నిర్వహించిన రామ్‌గులామ్ 1968 నుండి 1982 వరకు ప్రధానమంత్రిగా మారిషస్