పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తలకట్టు, మీసకట్టు, క్రాపులు, జడలు ఫోటోలలో తిలకించాము. ఆనాడు వారు తమతో తీసుకు వెళ్ళిన రోళ్ళు, రోకళ్ళు, వంటపాత్రలు ప్రదర్శనలో చూశాము.

మారిషస్ ఆంద్రుడు జి.రెడ్డిలక్ష్ముడు తమ పూర్వీకుల వలసను గురించి ఈ క్రింది కవితను వ్రాశారు.

మంచి రోజుల కోసమేమో
ఇల్లు నాలిని బంధుకోటిని
వీడుకున్న కూలీరైతులు
దేశగడపను దాటినారే

గమ్య మెరుగక గతి తెలియక
ఆంధ్ర పుత్రులు అంధంలోన
పొట్ట చేతన పట్టుకున్న
పరదేశ ప్రయాణ మేసే

గంజినీళ్ళు కడుపునింపే
కలిమిలేక చెలిమిలేక
సాహసంతో సాగరంలో
చేరినారొక స్వర్ణభూమి

కూలిఘట్టాన కాలు పెట్టిన
దిక్కులేని దయనీయులై
మాతృభూమిని మరువలేక
మెప్పుపొందే మారిషస్‌లో

మారిషస్‌కి వలస వచ్చిన తెలుగువారు ఐశ్వర్య సంపదలతో తరలి రాలేదు. కేవలం శ్రమజీవులుగా వచ్చి కాయకష్టంతో తమ జీవితం గడుపుకుని మారిషస్ అభివృద్దికి పాటుపడ్డారు.

ఆనాడు రాళ్ళు రప్పలతో నిండిన మారిషన్‌ని నేడు అధునాతన దేశంగా రూపుదిద్దుకోవడం వెనుక మనశ్రమజీవుల స్వేద బిందువులున్నాయి. ఆ దేశంలో "చెట్టుకొట్టి. మెట్టతవ్వి...కంపపొదల నరికి కాల్చి పుడమిదున్ని పండించిన మొదటివాడు తెలుగువాడు". మారిషస్‌కు తెలుగువారి వలస, స్థిరపడటం గురించిన