పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

 మారిషస్ విద్యాశాఖ వారు మా కోసం ప్రత్యేకంగా ఒక బెంజి కారు ఏర్పాటు చేశారు. డ్రైవర్ పేరు పరదేశి. ఆ కారులో గోల్డ్ క్రిస్ట్ హోటల్ నుంచి బయలుదేరి మోకాలోని మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌కి చేరుకున్నాం

మహాసభ ప్రాంగణం అంతా సంబరపు సందడిలో అత్యంత కోలాహలంగా ఉంది. తెలుగు సంస్కృతికి అద్దం పడుతూ ప్రవేశ ముఖద్వారం ముంగిట రంగుల రంగ వల్లికలు హరివిల్లులై దర్శనమిచ్చాయి. "సుస్వాగతం" అంటూ సుమాక్షరాలు కన్నుల కింపు కలిగిస్తూ తీర్చి దిద్దదిడి ఉన్నాయి. ద్వారానికి ఇరువైపులా అరటి చెట్లు అందమైన ఆలంకారాలుగా నిలిచాయి. ఇక మామిడి తోరణాలూ.. బంతి పూదండలతో విదేశంలో ఉన్న మాకు స్వదేశీ వాతావరణాన్ని స్పురణకు తెచ్చి అపురూపమైన అనుభూతిని అందించింది. నేత చీరలు దరించిన వనితలు ముకుళిత హస్తాలతో రెండువైపుల నిలబడి నుదుటన తిలకం దిద్ది ఆహ్వానం పలికారు.

తల్లీ నీ యుత్సవము గాంచ దరలినార
అనుగు దనయులు నైవేద్య వస్తులగుచు
ధన్యులెల్లరు నాత్మోచితంపు కాన్క
అర్పణము సేయ వచ్చిరి యందికొమ్ము

దువ్వూరి రామిరెడ్డిగారి పద్యం మనసులో మెదిలింది. తెలుగు తల్లిని భక్తితో కొలవటానికి దేశదేశాల నుంచి వచ్చిన తెలుగు తనయులతో సమావేశ మందిరం కిట కిట లాడింది.

ప్రతినిధులకు బ్యాడ్జిలు, వివిధ పత్రాలు ఉంచిన ఫైల్స్ ఇచ్చారు. దక్షిణాఫ్రికా ఆంధ్ర సంఘం తమ ప్రతినిధులు సదస్సుల్లో సమర్పించే పత్రాలతో కూడిన ఫైల్స్ ఇచ్చారు.

దక్షిణాఫ్రికా నుండి 52 మంది, భారతదేశం నుండి 32 మంది, మలేషియా నుంచి 20 మంది, బల్స్ నానా, బెల్జియం, రియూనియన్ల నుంచి ఒక్కరేసి చొప్పున ప్రతినిధులు మహాసభలకు విచ్చేశారు. మారిషస్ నుండి 200 మంది ప్రతినిధులు 100 మంది పరిశీలకులు సభలో పాలుపంచుకున్నారు.

స్నేహవేదిక

మహాసభల వేదిక శోభాయమానంగా అలంకరించ బడింది. వేదిక ముందు దేశభాషలందు తెలుగు లెస్స' అనే బ్యానర్ని కట్టారు వేదికపై తెలుగు తల్లి కటౌట్