పుట:మారిషస్‍లో తెలుగుతేజం.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

 జ్యోతి మహాసభ అధ్యక్షులు తెలుగులో మాట్లాడుతూ సంప్రదాయ బద్దంగా పూజలు చేసేటందుకు పురోహితులను ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించాలని కోరారు. భారతదేశం నుండి మారిషన్ కు వచ్చిన ఇతర జాతులకున్న అవకాశం తెలుగు వారికి లేకున్నదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

మారిషస్ జ్యోతి మహాసభవారు ఆ దేవాలయ ప్రాంగణంలోనే మాకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆంధ్ర వంటకాలు రుచి చూపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు స్త్రీ, పురుషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మహాత్మాగాంధీ సంస్థాన్

మోకాలోని మహాత్మాగాంధీ సంస్థాన్‌లో ఆ రాత్రి 8 గంటలకు విదేశీ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ సంస్థాన్ మారిషస్‌లోని భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థ. విశాలమైన ప్రాంగణంలో పెద్ద పెద్ద భవంతులు, వాటి మధ్య సువిశాలమైన ఆడిటోరియం ఉన్నాయి. ఈ ఆడిటోరియం 1976లో జరిగిన ద్యితీయ విశ్వ హిందీ సమ్మేళనాన్ని పురస్కరించుకుని నిర్మించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే తైలవర్ణ చిత్రాలతో ఆ ఆడిటోరియం అందంగా నిర్మించబడి ఉంది.

ఆడిటోరియం సమీపంలో అందమైన పచ్చికబయళ్ళమధ్య మహాత్మాగాంధీ నిలువెత్తు విగ్రహం చూపరులను ఆకర్షిస్తూ ఆ మహనీయుని పట్ల భక్తి ప్రపత్తులను కలిగిస్తుంది. మహాత్మాగాంధీ 1901 లో దక్షణాఫ్రికా నుండి మారిషస్ వచ్చి అక్కడి భారతీయులను ఉత్తేజ పరిచారు. మారిషస్ అంతటా విస్తృతంగా పర్యటించి భారతీయుల స్వాగత సత్కారాలు అందుకున్నారు. స్వభాషాభిమానం పెం చుకోమని, స్వశక్తితో కష్టాలను ఎదుర్కోమని వారికి భోదించారు. 21 రోజుల పాటు మహాత్ముడు మారిషస్ నలుమూలల చేసిన పర్యటన అక్కడి భారతీయులలో విశ్వాసాన్ని ప్రోది చేసింది.

1901 డిశెంబర్ 1 న మహాత్ముడు భారతదేశం చేరుకుని కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో మారిషస్ భారతీయుల స్థితి గతులను గురించి ఒక సమగ్ర నివేదిక సమర్పించారు. మారిషస్ జాతిపిత సర్ శివసాగర్‌రామ్ గులామ్ పై మహాత్ముని ప్రభావం అమితంగా పడింది. మారిషస్ స్వాతంత్ర్యోద్యమంలో ఆయనకు మార్గదర్శకం అయ్యింది.

మహాత్మాగాంధీ పట్ల అపారమైన గౌరవంతో మారిషన్ లో ఆయన పేరుతో